పులిని చూసి ‘మరో నక్క’ వాత!మేము శ్రీపతి యాత్రకి వెళ్ళిన రోజునే, మా అమ్మాయి తన అయిదేళ్ళూ, అయిదునెల్లూ వయసు ఇద్దరు కొడుకులతో, వాళ్ళ మామ, అత్తగార్లతో, షిరిడీ సాయి దర్శనానికి వెళ్ళీంది!
వాళ్ళు తరచూ, కనీసం నెలా, రెండునెలలకోసారి వెళుతూ వుంటారు! “తిరుపతిలా కాకుండా, అక్కడ యెంతమంది వున్నా, ప్రతీ ఒక్కరూ నిశ్శబ్దం గా, తనివితీరా, సాయి దర్శనం చేసుకోవడమే కాకుండా, ఆయన పాదాలు స్పృశించడం, చిన్నపిల్లల్ని ఒక నిమిషం ఆయన పాదాల దగ్గర పడుక్కోబెట్టడం, ‘ధుని’ లో వాళ్ళు అర్పణం చెయ్యడం—హాయిగా, సంతృప్తితో తిరిగి రావడం” జరుగుతాయని ఉత్సాహం గా చెప్పేవారు!
మరి ఇప్పుడు—తేడా యేమిటంటే—‘తొక్కేశారమ్మా! చంటి పిల్లలని కూదా చూడలేదు! ఆడవాళ్ళనీ చూడలేదు! ముసలీ, ముతకా కూడా చూడలేదు! అందరూ నలిగి, నలిగి, ప్రాణాలతో బయట పడ్డాము’ అని మా అమ్మాయి ఫోను!
తరవాత, ఇంటికి వచ్చాక, మమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు—“ఇదివరకు కేవలం ఒక్క మనిషే పట్టేలాగ క్యూ లైన్లు వుండేవి! ఇప్పుడు ముగ్గురు నలుగురు ఒకేసారి వెళ్ళిపోయేలాగ, క్యూ లైన్ల వెడల్పు పెంచేశారు! బాబా దగ్గరకి వెళ్ళనివ్వడం లేదు! పాద స్పర్శ దేవుడెరుగు! బయటినించే గెంటేస్తున్నారు! అంతా గోల గోల!”
అదండీ సంగతి!
వీళ్ళు మూర్ఖులా? వాళ్ళు మూర్ఖులా? ప్రజలూ, భక్తులూ మూర్ఖులా?
వాడు కూడా ‘డబ్బు సంపాదన’లో పడ్డాడా? యెవరికి వడ్డీలు కట్టడానికి?
తేల్చుకోండి!