సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
(నా) "భక్తి" చానెల్..... గోవిందునిక్కూడా తప్పని పాట్లు!
శమంతకమణివినాయక వ్రతకల్పంలో, పూజ అయ్యాక చెప్పే కథలో శమంతకోపాఖ్యానం ఒకటి! యేమిటట దాని గొప్పతనం? ఆ మణి రోజుకి 18 బారువల బంగారాన్ని ఈనుతుందట! ఆ మానం (కొలత) తెలుసా? 8 వీశెలు = 1 మణుగు 20 మణుగులు = 1 బారువ ఇక 1 వీశ అంటే, సరిగ్గా గుర్తులేదుగానీ, ఈనాటి దాదాపు ఓ కేజీన్నర అనుకుంటా! వూహించారా—ఎంత బంగారమో? ఈ ఉపాఖ్యానం యేమిటంటారా? అలాంటిది తితిదే బోర్డు చైర్మన్ పదవి—అని చెప్పడానికి! మరి కాకపోతే, తన పార్టీ విప్ ధిక్కరించి, ప్రధాని మీదా ప్రభుత్వం మీదా విశ్వాసం ప్రకటిస్తూ వోటు వేసిన మర్నాడే ఆ పదవి ‘ఆదికేశవుడిని’ వరించిందా? మరి తృప్తి పడకుండా, దేవుడి చేతా, తైనాతీల చేతా బంగారం ముష్టెత్తించడం ఎందుకు? అదో తుత్తి! అంటారా! ఏమో! అసలు స్వామి వారికి ఎంత బంగారం వుంది? ఇతర ఆస్థులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ వున్నాయి? వాటి భద్రత మాటేమిటి? యెవరికైనా తెలుసా? ఈ భక్తులు రొజూ ఓ కోటి రూపాయాల నగదూ, కొన్ని కేజీల బంగారం స్వామికి సమర్పించడమేనా, వారి తరఫున లెఖ్ఖలు అడిగేవారెవరైనా వున్నారా? అసలు దేవస్థానం వ్యవహారాల్లొ పారదర్శకత అంటూ వుందా? ఇవి కొన్ని ప్రశ్నలు! సమాధానాలు తెలిసినవాళ్ళు చెప్పొచ్చు. అందరూ తెలుసుకొని నిశ్చింతగా నిద్రపోతారు! (స్వామివారుకూడా రాత్రి కేవలం గంటన్నర మాత్రమే నిద్రపోతున్నారట!--అలా అనేకంటే తితిదే వారు నిద్రపోనిస్తున్నారట--అంటే బాగుంటుందేమో)
శ్రీగిరి శ్రీపతి గోవిందా!కలికాలం కాకపోతే—ప్రపంచంలోకెల్లా ధనికుడైన దేవుడిచేత ముష్టెత్తించడం ‘ఆదికేశవుడు’ కే చెల్లింది! అయినా, తన పెళ్ళి సందర్భంగా చేసిన అప్పుకిగాను కలియుగాంతం వరకూ వడ్డీ ఇస్తానని ఒప్పుకున్నాడట కానీ, అసలెప్పుడు తీరుస్తాడో చెప్పిన దాఖలాల్లేవుకద! అయిన ఇచ్చేవాడికి లేనిది మనకేమిటి! కానీ యే సందర్భంలోనూ ఆ శ్రీనివాసుడు ముష్టెత్తుతానని యెక్కడా చెప్పలేదుగా? మరి తితిదే బోర్డు చైర్మన్ అంటే మజాకా? ఆయన ‘ఔరంగజేబు తన తిండికి టొపీలు కుట్టి సంపాదించుకున్నాడట. నువ్వుకూడా ముష్టెత్తైనా (బంగారం) సంపాదిస్తేనే నీ ఆనందనిలయానికి బంగారు తాపడం…లేకపోతే లేదు అంటే, అంతటి శ్రీనివాసుడికీ గత్యంతరమేమిటి? పనిలో పనిగా ఆయన వెనకాల ఆది కేశవ భక్తులుకూడా బోలెడంత బంగారం సంపాదించుకోవచ్చు----లెఖ్ఖా పత్రం అక్కర్లేదుగా! అడిగేవాడెవడు? ఇంకా చాలా అడిగేవాడు లేడు! అవి మరోసారి!