Tuesday, October 28, 2008

శ్రీగిరి శ్రీపతి గోవిందా!
కలికాలం కాకపోతే—ప్రపంచంలోకెల్లా ధనికుడైన దేవుడిచేత ముష్టెత్తించడం ‘ఆదికేశవుడు’ కే చెల్లింది! అయినా, తన పెళ్ళి సందర్భంగా చేసిన అప్పుకిగాను కలియుగాంతం వరకూ వడ్డీ ఇస్తానని ఒప్పుకున్నాడట కానీ, అసలెప్పుడు తీరుస్తాడో చెప్పిన దాఖలాల్లేవుకద! అయిన ఇచ్చేవాడికి లేనిది మనకేమిటి! కానీ యే సందర్భంలోనూ ఆ శ్రీనివాసుడు ముష్టెత్తుతానని యెక్కడా చెప్పలేదుగా? మరి తితిదే బోర్డు చైర్మన్ అంటే మజాకా? ఆయన ‘ఔరంగజేబు తన తిండికి టొపీలు కుట్టి సంపాదించుకున్నాడట. నువ్వుకూడా ముష్టెత్తైనా (బంగారం) సంపాదిస్తేనే నీ ఆనందనిలయానికి బంగారు తాపడం…లేకపోతే లేదు అంటే, అంతటి శ్రీనివాసుడికీ గత్యంతరమేమిటి? పనిలో పనిగా ఆయన వెనకాల ఆది కేశవ భక్తులుకూడా బోలెడంత బంగారం సంపాదించుకోవచ్చు----లెఖ్ఖా పత్రం అక్కర్లేదుగా! అడిగేవాడెవడు? ఇంకా చాలా అడిగేవాడు లేడు! అవి మరోసారి!

No comments: