Sunday, September 13, 2009

స్వాములూ........


.......మాధవ సేవ!


మా సిబ్బంది అస్తమానూ మసిలే ఓ ప్రదేశం లో ఓ గోడమీద ప్రముఖం గా కనిపిస్తూ అంటించబడి వుంటుంది ఓ చిన్న బ్రోచర్--దానిమీద ఓ ప్రముఖ స్వామీజీ ఫోటో, ఆ ప్రక్కనే "మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ" అని వ్రాసి వుంటుంది--యెన్నేళ్ళక్రితం యెవరు అంటించారో!  


బుర్రలో మరేమీ ఆలోచనల్లేనప్పుడు, దాన్ని చూసి, 'ఈ స్వామికి చాతుర్మాస్య వ్రతాలూ, అనుగ్రహ సంభాషణలూ తప్ప, సేవ చెయ్యడానికి సమయం వుంటుందా? వున్నా చెయ్య నిస్తారా?' అనుకుంటూ వుండేవాణ్ణి మనసులో!  


33 కుటుంబాలకి సరిపోయేలా వసతి కల్పించడానికి నిర్మించబడ్డ, శిథిలమైపోయిన 'వేయికాళ్ళ మంటపాన్ని ' తొలగిస్తే, 'ఆగమ శాస్త్ర ప్రకారం దాన్ని అలాగే అక్కడే పునర్నిర్మించవలసిందే'--అంటూంటే, అనవసరం గా ఈయన యెందుకిలా ప్రవర్తిస్తాడు--అనుకొనేవాణ్ణి.  


ఆయనెవరో కాదు--మీరు వూహించే వుంటారు--శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి!  


ఆయన విజయనగరం లోని జీయర్ ట్రస్ట్ నిధులతో, అంధ విద్యార్థులకోసం 'నేత్ర విద్యాలయాన్ని ' నిర్వహిస్తూ, దాన్ని జూనియర్ కాలేజ్ స్థాయికి పెంచి, విద్యార్థులకి 'ల్యాప్ టాప్' లు ఉచితం గా ఇచ్చి వారిచేత పరీక్షలు వ్రాయించడానికి బోర్డుని ఒప్పించి, వాళ్ళు ఉత్తీర్ణులయ్యేలా చేశారంటే--అంతకన్న మాధవ సేవ యేముంటుంది!  


స్వామీ! నమోవాకాలు!  


మిగిలిన గడ్డాల మీసాల కాషాయ స్వాములు కూడా--ఆశ్రమాలూ, గుళ్ళూ, గోపురాలూ, గీతా మందిరాలూ, ధ్యాన మందిరాలూ కట్టించడం మానేసి--ఇలాంటి మాధవ సేవకి పూనుకొంటే...............!  


ఆ విధం గా మనం ఆశిద్దామా?


5 comments:

durgeswara said...

svaamulaku koodaa maaragadarsanam cheyagala meevamti maahaatmulu arudugaa vumtaaru.

imataku mee gruhjastu dharmaanni koodaa vadali meeru chestunna seva emito telusu kovaalanumdi.

A K Sastry said...

డియర్ durgeswara!

పొగిడేసినవా--తిట్టేసినవ?

'నా గ్రుహ్జస్తు ధర్మం' అంటే యేమిటో నాకు తెలియలేదు.

సంపాదించి బలిసినవాళ్ళూ, తీరికవున్నవాళ్ళూ సేవ చేస్తే బాగుంటుందన్నానుగాని, నేను సేవ చేస్తున్నాను అని చెప్పలేదే? నేనంత బలవనూలేదు--నాకంత తీరికాలేదు!

చదివింది ముందు అర్థం చేసుకొని, తరవాత మాట్లాడితే బాగుంటుంది--లేకపోతే--దానికొకటే పేరు--నోరు పారేసుకోవడం!

ధన్యవాదాలు!

durgeswara said...

నోరు పారేసు కోవటం అంటే .ఉచితానుచితాలు మరచి ఇఅతరులను విమర్శించటం . లెదా ఇతరులను ధూషించటం . ఆలెక్కన ఎవరు నోరు పారేసుకున్నారో చూడండి . ఆటివారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ . మనం బలసిన వాల్లు అనెదెవరిని? మనకంటే ఇంకా దిగువస్తాయిలో వున్నవాల్లదృస్ఠిలో మీసిద్దాంతం ప్రకారం మనం బలసినవాల్లకిందే లెక్క. కాబట్టి మనైంట్లో పప్పన్నం తిన్నా పచ్చడిమెతుకులు మాత్రమే దొరికేవాడికి మనం బలిసినవాల్లకిందే లెక్క . మనైంట్లో ఏ సౌకర్య కర వస్తువున్నా మనం త్యాగధనులమైతే అవి వదులుకోని లేనివారికి వెచ్చించవచ్చు .కాని మనం చేయము .ఇఅతరులెవరో చేయాలని ,వాల్లంతా బలసినవాల్లనే సాహసం చేసి ఎవరు నోరు పారేసుకుంటున్నారో గమినించుకోవాలిమనం . మిత్రమా ! పరధూషన మహాపాపం . చదువు వినయాన్ని పెంచాలి ,అహంకారాన్ని కాదు .ఒకసారి విదురనీతిలో పద్యాలు చదివేవుంటారు చిన్నప్పుడు గుర్తుకు తెచ్చుకోండి.
సమాజంలో తమకంటె దుర్భరస్థితిలో వున్నవారికి సహాయపడటం గృహస్ఠుధర్మములలో ఒకటి. లోకాన్ని ఆధ్ర్మమార్గాన నడపించటం ధర్మాచార్యులపని. మనం మనధర్మాన్ని ఆచరించక సోమరులమై కూర్చున్నవేళ వాల్లు పనికట్టుకుని మరీ ఈపని చేపిస్తున్నారు. మనం చేయనన్నా చేయాలి .చేసేవాల్లను గౌరవించనన్నా గౌరవించాలి.అంతవరకే ఎవరేమి చేస్తున్నారో మనకు తెలియదుకదా ? ఎందుకంటే సత్కార్యాలు చేసేవారెవరూ మన సర్టిఫికెట్ ల కోసం ఆసపడి అవన్నీ వెల్లడించరు.
హితము చెప్పేవాడు మిత్రుడనుకుంటె నేను మీకు మిత్రుడనే . కాదనుకుంటె నేనెప్పుడూ మీ చాయలకు రావాల్సిన పనివుండదు.

durgeswara said...

paina tappulu dorlaayi type lo kshamimchamdi

A K Sastry said...

డియర్ durgeswara!

నేను వ్రాసినదాని ప్రకారం, మార్గదర్శనం చేసింది శ్రీ చిన జీయర్ స్వామి! దాన్ని వెటకారం గా 'మీవంటి మహానుభావులు ' అని అన్నదెవరు?

నా 'అదేదో' ధర్మాన్ని 'కూడా' వదలి--అని యెవరో యెవరిమీదో వాడిన యెంగిలి వ్యాఖ్యని వాడితే, అది పారేసుకోవడం గాక యేమనాలో?

ఇక యెవరూ తాము చేస్తున్న సేవ గురించి డబ్బా కొట్టుకోరు అని మీరే అంగీకరించారుకదా? నన్ను ప్రశ్నించడం యేమి సబబు?

ఇక, నేను వ్రాసిన టపాలో ముఖ్య విషయం 'బలిసినవాళ్ళు ' కాదు కదా? మీకు అంతగా ఆసక్తి వుంటే, మరో టపాలో వివరిస్తాను!

నా టపాలో 'పరదూషణ ' యేం కనిపించిందో తమకి, వివరించగలరా?

హితం చెప్పినా లేకపోయినా, మితృణ్ణి అన్నారు--చాలా సంతోషం! నేను అజాత శతృవును అవునోకాదో గానీ, నాకందరూ మితృలే!

మరోసారి, నెమ్మదిగా నా టపా చదివి, మీ గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పండి--నేనేదైనా పొరపాటు వ్రాసి వుంటే!

ప్రస్తుతానికి సెలవ్!

ధన్యవాదాలు!