అదే తీరు
చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా?
యెడం చేయి తీసి పుర్ర చెయ్యి పెడితే యేమైనా తేడా వుంటుందా?
ముల్లూపోయి కత్తీ వచ్చే......లో యెన్ని పోతే కథ పూర్తవుతుంది?
పాలక మండలి పోయి, సాధికార మండలి వస్తే యేమైనా మారుతుందా?
యేమో మరి!
ఏకగవాక్ష విధానం కోసం "శ్రీ-సేవ" పేరుతో ఓ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మిస్తారట. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం ఓ 50 శ్రీ-సేవ కేంద్రాలు యేర్పాటు చేస్తారట!
కొండమీద ధ్యాన మందిరాలు కట్టిస్తారట!
(భద్రాచలం లో కొండమీదే ఆలయం ప్రక్కన కట్టిన "శ్రీ రామదాసు ధ్యాన మందిరం" ఇప్పటివరకూ యెందుకూ వుపయోగపడిన దాఖలాలు లేవు--అలాగే శిధిలం అయిపోతూంది.)
అయినా అభివృధ్ధికల్లా మూలం బిల్డింగులు కట్టడమేనా?
సరే--మహాలఘువుని రేపు ఒకటో తారీకు నించీ రద్దు చేశామని ఇప్పటికే ప్రకటించారు కదా? మళ్లీ ఇప్పుడు దర్శనాలపై "పునః సమీక్ష" చేస్తామనడం యేమిటి?
కొన్ని రోజుల్లోనే ఈ మార్పుకి కారణం యేమిటి?
యేమీ లేదు--వీళ్లు రోశయ్యగారితో సమావేశం లో పాల్గొన్నారట. ఇంకా అందులో మంత్రులు గాదె వెంకట రెడ్డి, దానం నాగేందర్, ప్రథాన కార్యదర్శి ఎస్ వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారట!
ఇదేదో విక్రమార్కుడి సిం హాసనం కథ లాగ.....!
అదండీ సంగతి!
2 comments:
వాళ్ళంతేలెండి మీరు అందుకోండి మా వినాయకచవితి శుభాకాంక్షలను.
డియర్ చిలమకూరు విజయమోహన్!
చాలా సంతోషం.
మీకూ, మీ కుటుంబానికీ, ఆ "విజయ" గణపతి సకలైశ్వర్యాలూ అనుగ్రహించుగాక.
ధన్యవాదాలు.
Post a Comment