శమంతకమణి
వినాయక వ్రతకల్పంలో, పూజ అయ్యాక చెప్పే కథలో శమంతకోపాఖ్యానం ఒకటి!
యేమిటట దాని గొప్పతనం?
ఆ మణి రోజుకి 18 బారువల బంగారాన్ని ఈనుతుందట!
ఆ మానం (కొలత) తెలుసా?
8 వీశెలు = 1 మణుగు
20 మణుగులు = 1 బారువ
ఇక 1 వీశ అంటే, సరిగ్గా గుర్తులేదుగానీ, ఈనాటి దాదాపు ఓ కేజీన్నర అనుకుంటా!
వూహించారా—ఎంత బంగారమో?
ఈ ఉపాఖ్యానం యేమిటంటారా? అలాంటిది తితిదే బోర్డు చైర్మన్ పదవి—అని చెప్పడానికి!
మరి కాకపోతే, తన పార్టీ విప్ ధిక్కరించి, ప్రధాని మీదా ప్రభుత్వం మీదా విశ్వాసం ప్రకటిస్తూ వోటు వేసిన మర్నాడే ఆ పదవి ‘ఆదికేశవుడిని’ వరించిందా?
మరి తృప్తి పడకుండా, దేవుడి చేతా, తైనాతీల చేతా బంగారం ముష్టెత్తించడం ఎందుకు? అదో తుత్తి! అంటారా! ఏమో!
అసలు స్వామి వారికి ఎంత బంగారం వుంది?
ఇతర ఆస్థులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ వున్నాయి?
వాటి భద్రత మాటేమిటి?
యెవరికైనా తెలుసా?
ఈ భక్తులు రొజూ ఓ కోటి రూపాయాల నగదూ, కొన్ని కేజీల బంగారం స్వామికి సమర్పించడమేనా, వారి తరఫున లెఖ్ఖలు అడిగేవారెవరైనా వున్నారా?
అసలు దేవస్థానం వ్యవహారాల్లొ పారదర్శకత అంటూ వుందా?
ఇవి కొన్ని ప్రశ్నలు!
సమాధానాలు తెలిసినవాళ్ళు చెప్పొచ్చు. అందరూ తెలుసుకొని నిశ్చింతగా నిద్రపోతారు!
(స్వామివారుకూడా రాత్రి కేవలం గంటన్నర మాత్రమే నిద్రపోతున్నారట!--అలా అనేకంటే తితిదే వారు నిద్రపోనిస్తున్నారట--అంటే బాగుంటుందేమో)
3 comments:
bavuMdi
డియర్ అశ్విన్!
సింపుల్ గా బాగుందంటే, యేం బాగుందో నాకెలా తెలుస్తుంది?
ఇంకొంచెం సమయాన్నీ, శక్తినీ వినియోగించరూ! ప్లీజ్!
ఇంకా చదువుతూ వుండండి.
చిన్న సవరణ!
శమంతకమణి రోజుకి "8 బారువల" బంగారాన్నే ఈనుతుంది!(ట).
పొరపాటున "18 బారువలు" అని వ్రాశాను!
క్షంతవ్యుణ్ణి!
Post a Comment