Saturday, February 21, 2009

అక్రమార్క సేవలు

మన శ్రీ. శ్రీ. దే. లో చిరుద్యోగులు సైతం, సొంత కార్లలో కార్యాలయాలకి వస్తున్నారట! శ్రీవారి సేవల టిక్కెట్లని దొడ్డి దారిలో అమ్మేసుకొని, లక్షాధికారులు అయి పోతున్నారట! మామూలుగా రిజార్వేషనే కాకుండా ‘విచక్షణ’ కోటా కూడా వుంటుంది! ఈ విచక్షణ కోటా క్రిందే మొన్న వేలాది పాసులు జారీ చేస్తె, క్యూ లైన్లు కదలడంలేదని జనాలు అందోళన చేసి, ఆ లైన్లనే విరగ్గొట్టారు! వస్త్రాలంకార సేవకి మామూలుగా రూ.12,250/- టిక్కెట్ అయితే, విచక్షణ కోటా క్రింద రూ.50,000/- ట. మరి వీటిని రూ. లక్షకి అమ్ముకుంటే యెంత లాభం? అభిషేక సేవకి జులై 2029 వరకూ రిజర్వేషన్ లు అయి పోయాయట! వస్త్రాలంకార సేవకి ఏప్రిల్ 2020 వరకూ అయి పోయాయట! మరి మీరేమో వీ ఐ పీ! రేపే మీకు వీటిల్లో యేదో సేవకి టిక్కెట్ కావాలి. యెమి చేస్తారు? మేము యేమి చేస్తాము? యెలాగోలా మీకు ఆ టిక్కెట్లు దాఖలు చెయ్యక చస్తామా! సందట్లో సడేమియా, మేమో రెండు నొక్కేస్తాము! అన్నిటికీ ఆ పైవాడే వున్నాడు! విజిలెన్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పై అధికారుల దృష్టికి తెచ్చినా, మనకేం ఊడింది! అదండీ సంగతి!

4 comments:

bonagiri said...

కొనేవాళ్ళున్నారు కాబట్టే వాళ్ళు అలా బ్లాకులో అమ్ముతున్నారు.
బ్లాకులోనైనా కొని నాకు సేవలు చేయించమని ఆ దేవుడు అడిగాడా?
ఇదంతా మూర్ఖత్వం. ఆ డబ్బులేవో హుండీలో వేస్తే పొలే.
www.bonagiri.wordpress.com

krishna rao jallipalli said...

అన్నిటికీ ఆ పైవాడే వున్నాడు....డబ్బు, అధికారం, రాజకీయం ఉన్నచోట పైవాడు కూడా ఏమి చేయలేడు. అవసరమైతే వెంకన్న గారు కూడా బ్లాకులో కొనాల్సిందే. కాకపొతే కొంచం కన్షేషన్ ఇస్తారు అంతే.

kvsndkraja said...

mana desam lo vigilence,cbi department lu kooda nidra potunnayi.kaavaalante okka sari aa websites lo kelli yemina information cheppataniki try cheyandi.modata aa pege open kadu.oka vela aina vaari nunchi response raneradu.yee departments kooda prabhutwa peddala aaseessulato nadustunnayi.

A K Sastry said...

యెన్నాళ్ళకెన్నాళ్ళకు!

నా 'భక్తి చానెల్ ' మొదలు పెట్టాక, ఇన్నాళ్ళూ ఒక్క కామెంట్ కూడా రాలేదు....జనాలు భయపడుతున్నారా యేమిటీ....అని నేను సందేహిస్తుంటే, ఒకే సారి మూడు టపాలు....అదీ 'మూర్ఖత్వం' '.....బ్లాకులో కొనాల్సిందే' 'ప్రభుత్వ పెద్దలూ లాంటి మాటలతో!

చాలా సంతోషం!

నా ఆవేదనల్లా.....ఇవి కొనసాగాల్సిందేనా? మనం మార్చలేకపోవచ్చు కానీ ఓ దారి చూపించలేమా?

నా అభిలాష.....ఇవన్నీ మారి, దేవుడు సామాన్యులకి అందుబాటులో వుండాలని! ఆయన డబ్బులు పిండుకునే యంత్రం కాకూడదు అని!

నా వినతి........అందరూ దానికి కృషి చెయ్యాలని!