'......గోవిందా!'(లు)
పట్టణ గోవిందం, పల్లె గోవిందం, గిరిజన గోవిందం లు కిట్టుబాటు కావడం లేదు కాబోలు--యేకం గా 'ఫారిన్ గోవిందం' తలపెట్టి, ఓ మందని దేవస్థానం ఖర్చుతో ఫారిన్ యాత్ర చేయిద్దామనుకొన్నారు.
దైవమింకొకటి తలిచి, మందలో చాల మందికి వీసాలు రాకపోవడం తో, కొంతమందే వెళ్ళారు.
ఓ నగరం లో మొన్ననే ఓ గోవిందం 'దిగ్విజయం' గా పూర్తయ్యింది కూడా!
యెలా?
1000 డాలర్లు చెల్లించినవారికి--వీ ఐ పీ దర్శనం, 10 నించి 1000 లోపు డాలర్లు చెల్లించినవారికి--ఓ గంటనించి 10 గంటల్లో దర్శనం--ఇలా దండుకున్నారని మీడియా కోడై కూస్తోంది.
(ఈ మీడియాకేం పనిలేదు. అస్తమానూ కోడైపోతూ వుంటుంది--అని విసుక్కుంటున్నారు నిర్వాహకులు!)
1000 డాలర్లంటే దాదాపు 50,000 రూపాయలు!
మరీ ఇంత కక్కుర్తా అని చెవులు కొరుక్కుంటున్నారు--ప్రవాసీ భక్తులు!
పోతే వాళ్ళే కదా! మనకేం?
No comments:
Post a Comment