'......సేవలు'
కొంతమంది ఆర్జన కి మాత్రమే వుపయోగపడుతున్న ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో, సుబ్బిరామిరెడ్డి హస్తం కూడా వుందట.
'ఓ ఇరవై లక్షలు పంపించాం! ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కోసం--అవి లేవన్నారు, సరేపోనీ మిగిలిన సేవలకి ఓ 168 టిక్కెట్లో, 186 టిక్కెట్లో పంపించండి అన్నాం! వాళ్ళు వెంటనే పంపించారు' అని ఆయన భార్య వివరణ.
'ఇందులో యేమీ అక్రమాలు లేవు' అని ఆదికేశవుడి సమర్థన!
వీ ఐ పీ ల కోసం, గంటలతరబడి క్యూ లైన్లు ఆపెయ్యడం--'ఒక్క క్షణం కూడా ఆపలేదు' అని ఆదికేశవుడి బుకాయింపు!
లఘు, మహా లఘు, మహావీర లఘు దర్శనాలకి సామాన్యులకి అనుమతిస్తున్న ఓ సెకనో, రెండు సెకన్లో సమయం ప్రకారం రేటు కట్టి, వీ ఐ పీల దగ్గర అంత డబ్బూ యెందుకు వసూలు చెయ్యరు?
వాళ్ళు సేవలు చేస్తేనే స్వామి తరిస్తున్నాడా?
అసలు ఈ సేవల్ని యెందుకు రద్దు చెయ్యరు?
2 comments:
'ఓ ఇరవై లక్షలు పంపించాం! ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కోసం--అవి లేవన్నారు, సరేపోనీ మిగిలిన సేవలకి ఓ 168 టిక్కెట్లో, 186 టిక్కెట్లో పంపించండి అన్నాం! వాళ్ళు వెంటనే పంపించారు' WHahat ? nijama ?
ఆహా! స్వయం గా సుబ్బిరామిరెడ్డి భార్య పత్రికలవాళ్ళకి ఇచ్చిన వివరాలే ఇవి!
నిజం గా నిజాలే అనుకోవాలి మరి!
Post a Comment