Wednesday, December 1, 2010

శ్రీగిరి శ్రీపతి

........స్వర్ణ "భయం"

......వదిలించింది వున్నత న్యాయ స్థానం చివరికి. ఈ పథకం చేపట్టడానికి తి ది దే బోర్డుకి అధికారమే లేదనీ, అది రాజ్యాంగం లోని 25, 26 అధికరణలకి విరుధ్ధమనీ తీర్పు ఇచ్చింది.

శ్రీవారి గరుడవాహనం సందర్భంగా అలంకరించే 'పెద్దకాసుల పేరు ' లోని కాసులపై 'విక్టోరియా మహారాణి ' చిత్రం (ముద్ర) వుంటుందని యెందరికి తెలుసు? ఆ కాసులే యెందుకు వున్నాయి? అనేదానికి సమాధానం యెందరికి తెలుసు?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారి నిర్వహించిన భక్తురాలు యెవరు? ఆవిడ బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రతి యేటా జరగడానికి వీలుగా వితరణ చేసిన భూమి యెంత? ఆ అయివేజుతోనే ఇప్పుడు వుత్సవాలు నిర్వహిస్తున్నారా?

అప్పటి రాజులు స్వామికి యెప్పుడు యేమేమి సమర్పించారు?

ఇలాంటి విషయాలన్నీ ఆ ప్రాకారం మీద శాసనాల రూపం లో శాశ్వతం గా ప్రతిష్టించబడ్డాయి.

అలాంటి గోడలని తాపడం కోసం ఐదు వేలకు పైగా బోల్టులు బిగించడానికి రంధ్రాలు చేసేస్తే, వాటిలో నీరు చేరి శాసనాలు దెబ్బతింటాయి అనీ, కట్టడం దెబ్బతింటుంది అనీ, పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికని కూడా లెఖ్ఖ చెయ్యకుండా ఈ పథకం యెందుకు ప్రవేశ పెట్టినట్టు?

పాలక మండలి 'అంచనా' మేరకు బంగారం, నగదు, రూపం లో 152 కిలోల బంగారం ఇంతవరకూ వచ్చిందట. ఆది కేశవుడేమో, 160 కిలోలు వచ్చింది, మిగతా 40 కిలోలూ నేనే ఇచ్చేద్దామనుకున్నాను--అంటున్నాడు.

ఆసలు లెఖ్ఖలెక్కడున్నాయి? ఆ బంగారం యెక్కడుంది? ఇప్పటివరకూ తయారుచేసిన రేకులు యెక్కడున్నాయి? ఈ బంగారం భద్రత మాటేమిటి? స్వామికే తెలియాలి.

దర్శనాలు త్వరితంగా జరగడానికి 'కదిలే తివాచీ' యేర్పాటు విషయం లో మాత్రం తప్పదనే అభిప్రాయానికొచ్చారట .....యెంత త్వరగా యేర్పాటైతే అంత మంచిది.

వేయికాళ్ల మండపం నిర్మాణానికి అడ్డంకులని తొలగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందనీ, దేవస్థానం నిర్మాణానికి పూనుకోవడం శుభపరిణామమని చిన జీయరు స్వామి సంతోషిస్తున్నాడు. ప్రస్తుత మండపాన్ని వందకాళ్లకు కుదిస్తున్నారనీ, స్థంభాలని అడ్డంగా నిర్మించేలా ప్రణాళికలు--పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట.

33 కుటుంబాలకి, వంటలు చేసుకొని, భోజనాలు చేసి, నిద్రపోయే వసతి కోసం నిక్షేపంగా సరిపోయేలా నిర్మించబడ్డ (ఆరోజుల్లో అతిపెద్దదీ, ఆలయానికి అతి దగ్గరలో వున్నదీ) అయిన వేయికాళ్ల మంటపాన్ని, శిధిలమయిపోయిందని తొలగిస్తే, అదేదో ఆగమ శాస్త్రాలకి విరుధ్ధమని ఈయన అనవసరం గా హడావిడి చేశాడు.

భవిష్యత్తులో బహుళ అంతస్థుల క్యూలైన్ యేర్పాటు చెయ్యవలసి వస్తే ఇది ఆదర్శమైన ప్రదేశం అవుతుంది. అలాంటి చోట మళ్లీ మంటపాలు నిర్మించడం యెట్టి పరిస్థితుల్లోనూ వాంఛితం కాదు.

దేవస్థానం వారు గమనిస్తే మంచిది!

2 comments:

మిస్సన్న said...

నిజంగా న్యాయ స్థానం సరైన తీర్పిచ్చి ఒక ప్రపంచ వ్యాప్తి పొందిన దేవాలయం రూపు చెడిపోకుండా అడ్డుకొంది. ఎవరో అన్నట్లు ఆదికేశవులు నాయుడుకు దేవాలయం అంతా స్వర్ణమయం చేసేసి శ్రీ కృష్ణ దేవరయలలా చరిత్ర లో చిరస్థాయిని పొందాలని తపన ఎక్కువైంది. ఆ తపనలో కీలకమైన విషయాలేమీ పట్టించుకోలేదు.40 కిలోలు కాకపోతే 100 కిలోల బంగారం ఇస్తానంటాడు. అక్రమ వ్యాపారాల ద్వారా పొందిన డబ్బు మూలుగు తొంటే ఎంతైనా ఇస్తారు. కీర్తి కండూతి.

A K Sastry said...

డియర్ మిస్సన్న!

అబ్బో! మీది చాలా విశాల హృదయమండీ! నిజంగా వాడు కండూతితో, చరిత్రలో నిలవడానికి, 40 కిలోలు ఇస్తాడంటే నమ్మేశారా!

యెలాగూ కోర్టు తీర్పు వచ్చేసింది కదా అని ఓ అభినవ దానకర్ణుడి పోజిచ్చాడంతే.

పథకం పేరుతో వాడి తైనాతీలు వివిధనగరాల్లో బంగారం 'దండుకొన్న' వైనాన్ని ఇదివరకు టపాల్లో వ్రాశాను. చదవండి.

ధన్యవాదాలు.