ఆభరణాలూ.....
"(తమకి చూపించిన) శ్రీవారి బంగారు, వెండి ఆభరణాలు 'పూర్తి స్వచ్చంగా' 'నాణ్యతతో' వున్నాయి" అని హైదరాబాదు ప్రభుత్వ మింట్ నిర్ధారించిందట.
"వందల కోట్ల" ఆభరణాల పట్ల తితిదే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందంటూ, అప్పటి సీవీ యెస్వో రమణకుమార్ నివేదిక ఇచ్చారట.
దరిమిలా, "ఆభరణాలన్నీ సక్రమంగానే వున్నాయని, వాటి విలువ 'రూ. 51 కోట్ల 'నీ (తుర్లపాటి వారు కూడా సభ్యులుగావున్న కమిటీ) తేల్చి, న్యాయస్థానానికి ప్రాథమిక నివేదిక సమర్పించారట!
ఇప్పుడు, మరో మూడు 'స్వచ్చంద ' కమిటీలని నియమించి, ఆభరణాల 'స్వచ్చత, నాణ్యత ' ల మీద నివేదికలిమ్మందట!
వీటిలో, హైదరాబాద్ మింట్, 'మా ఆధ్వర్యంలో (???!!!) 650 బంగారు, 350 వెండి....పరిశీలించాం, రాళ్ల స్వచ్చతని.....పరిశీలించాం.....పొందుపరచిన విధానంలోనే వున్నాయి ' అని సర్టిఫికెట్ ఇచ్చేసిందట.
ఇంకో జెమాలజీ కమిటీ, 'అంతా సక్రమంగానే వుంది ' అని సర్టిఫై చేసేసిందట.
మూడో.....ఇంకమ్‌టాక్స్ కమిటీ నివేదిక ఇంకా ఇవ్వాల్సి వుందట.
యెంత "పార దర్శకంగా" సా....గుతున్నాయో కదా ఈ 'పరిశోధనలు?'
చేటంత చెవులున్న మహాపరమాత్ముడికి చిన్న నక్షత్ర గడ్డిపువ్వులు పెడుతున్నట్లు లేదూ....ఈ వ్యవహారమంతా???!!!
ఇక్కడ దృష్టి దోషాలేమిటంటే........
మనం అడిగేది......
దేవస్థానం 'హాథీరామ్‌జీ మఠం' ఆధ్వర్యంలో వున్నప్పటినించీ, కృష్ణదేవరాయలు కన్నా ముందునించీ, యేరాజులు యెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఆ తరవాత యెవరెవరు యెప్పుడెప్పుడు యేయే ఆభరణాలు ఇచ్చారూ? ఇవన్నీ నమోదు కాబడిన 'అదేదో' రిజిష్టరు ప్రకారం మీ వెబ్ సైట్ లో పెట్టండి. (పాత రికార్డు లేకపోయినా, కరిగించేశారేమో అని అనుమానం వున్నా) ఇప్పుడు 'ఫిజికల్ 'గా వున్నవి మాత్రమే పెట్టండి చాలు. గతం గతః. అదీ పారదర్శకత అంటే! (వాటి నాణ్యతా వగైరాల విషయానికి తరవాత వద్దాం) ఈ కమిటీలూ, "క్లీన్ ఛిట్లు" అనవసరం.
తేదీలవారీగా (పాతవాటి విషయంలో శతాబ్దాల, దశాబ్దాల, సంవత్సరాలవారీగానూ)
వివరాలు ప్రకటించండి. రోజువారీగా వాటిని అప్డేట్ చేస్తూ వుండండి. (ఈపని ఇప్పటికే చేసి వుంటే నాలాంటివాళ్లూ, యావద్భక్తులూ సంతోషించివుందురు)
ఇప్పుడు చేసినా, అదే ఫలితం!
చేస్తారా?
2 comments:
నా నాలోకం బ్లాగులో నేను రాసిన టపా చదివి అప్పారావు గారు బాగుంది అని రాసారు. దానికి నేను స్పందిస్తూ వారీ బ్లాగ్ ఎప్పుడూ చూస్తుంటాను కనక గుర్తు వచ్చి నా ఆనందం తెలియ చేశాను. మధ్యలో మేరు ఎవరో వచ్చి మా ఇద్దరి మీద వెటకారంగా వ్యాఖ్యానం చేయటం ఏమిటో నాకు అర్ధం కాలేదు.మీకు నా రచన నచ్చకపోతే ఆ విధంగా స్పందించండి.సంతోషమే.నేను రాసింది అందరికీ నచ్చాలని లేదు.నచ్చుతుంది అనీ కూడా నేను అనుకోవటం లేదు.ఎవరో తెలియచేసిన స్పందనకు పిలవకుండా వచ్చి మీరు ఎగతాళి చేయటానికి పూనుకోవటం మీ కుసంస్కారాన్ని తెలియచేస్తుంది.ఈ విషయం బహుశా ఇంత వరకూ మీకు ఎవరు చెప్పి వుండరు.ఇప్పుడైనా నేను ఇంత శ్రమపడి మీ బ్లాగ్ లోకి వచ్చి ఎందుకు చెబుతున్నానంటే కనీసం ఇప్పుడయినా అర్ధం చేసుకుని ఇలాంటి పిచ్చి ఆనందాలు కలిగించే పనులు చేయకుండా వుంటారేమోనని.మీరు ఈ వ్యాఖ్య బహుశా తీసి వేస్తారేమో ..అందుకనే మీ గురించి అందరికీ తెలియాలని నా బ్లాగ్ లో కూడా ప్రచురిస్తాను మీ దగ్గర నుంచీ సరైన స్పందన రాకపోతే!
అయ్యా! హనుమంతరావుగారూ!
ఆగ్రహించకండి. ఇప్పుడే మీ వ్యాఖ్య చూశాను.
సీనియర్ పాత్రికేయులైన మీ ముందు పిపీలికం వంటి వాణ్ని. ఈనాడులో వచ్చే మీ వ్యంగ్య రచనలని అస్వాదిస్తేగానీ, టిఫిను కూడా చెయ్యనివాణ్ని. నా బ్లాగులో మీరు వ్యాఖ్యానిస్తే, 'అహో! హనుమంతరావుగారు వ్యాఖ్య వ్రాశారు...ధన్యోస్మి' అని ఆనందించినవాణ్ని.
మీ 'నాలోకం' బ్లాగులో, 27వ తేదీ టపాని మళ్లీ చదివాను. నా వ్యాఖ్యని ఇప్పటికే తొలగించినట్టున్నారు.
సురేఖగారికి నేనుకూడా అభిమానినే. బాపు గారి తరవాత అంతటి స్వచ్చమైన కార్టూన్లు వేస్తూంటారని.
నా వ్యాఖ్య యేమి వ్రాశానో నిజంగా నాకు గుర్తులేదు. యేదో సరదాగా వ్యాఖ్యానించినా, మీకు మనస్థాపం కలిగించే వుద్దేశ్యం యెంతమాత్రం లేదు. ఆ సాహసం కూడా చెయ్యను. మీకు వెటకారం ధ్వనించినందుకు మనస్పూర్తిగా క్షమించండి.
నా వ్యాఖ్య యేమిటో మీకు యెక్కడ మనస్థాపం కలిగిందో నాకు aksastry@gmail.com కి మెయిల్ చేస్తే, ఇంకా వివరంగా క్షమాపణ కోరగలను.
నా ప్రథమ తప్పిదాన్ని మన్నించమని మరోసారి ప్రార్థిస్తూ, శాంతించమని మనవి.
దయుంచండి.
Post a Comment