Monday, August 22, 2011

శ్రీవారి ఆలయం



దర్శనాలూ

మొన్నేదో "డయల్ యువర్ ఈవో" నో ఇంకేదో కార్యక్రమంలో, భక్తులు చెప్పినమేరకు, శ్రీవారి వెండివాకిలి నుంచి బంగారు వాకిలి వరకూ, భక్తుల నడక ఒకే యెత్తులో వుండేలా (మరి  ఇన్నాళ్లూ భక్తులు దేవుణ్నే చూశారా, తమకాళ్లు యెక్కడ వేస్తున్నమో చూసుకొంటున్నారా?) "చెక్క బెంచీల" యేర్పాటు చేస్తామని సెలవిచ్చారు. ఇన్నాళ్లూ చెక్కలు లేవా? వున్నాయి కానీ గుమ్మాలెక్కడం దిగడంలో యెగుడుదిగుడుగా--యెత్తుగా, వాలుగా, ఇంకోలా (జనాలు బోల్తా కొట్టేలా!)

ఇప్పుడు చేస్తామన్న యేర్పాటు బాగానే వుంది గానీ, ఇన్నాళ్లూ వారికి తెలియదా ఈ సంగతి? కొన్ని లక్షలో యెన్నో ఖర్చుపెట్టడానికి కాకపోతే, జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి కాకపోతే, ఈ యేర్పాటు యెందుకు? మరి పాత చెక్కలు యేమి చేస్తారు?

వీటన్నింటికీ బదులుగా, వాకిళ్లని సన్నగా వుండే వాళ్లయితే ఇద్దరు, మీడియంగా వుండేవాళ్లయితే, 1న్నర మంది, కాస్త లావు వాళ్లయితే ఒక్కరే పట్టేలా మార్పు చేస్తే, ఇంక తోపులాటలు వుండవు కదా? దానికి ఖర్చు కూడా యెక్కువ కాదు--ఇంకా వెండి, బంగారు తాపడాల్లో బోళ్లు మిగులుతుంది!

చేస్తారా? చూద్దాం!

4 comments:

ఆత్రేయ said...

" మీడియం గా ఉండే వాళ్ళైతే " ఒకటిన్నర మంది అంటే వాకిలి బయట ఒక రంపం పెట్టాలి.

Sujata M said...

భలే వాళ్ళే ! తోపులాటలు లేకపోతే, తృప్తి ఎలా కలుగుతుంది ? ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎంత సేపటికి బైటికి వద్దామా అనే 'విష్ణుమాయ' లో పడిపోయిన భక్తుడు, బయటకు వచ్చి, ఉస్సురుమని, దేవుణ్ణి చూళ్ళేదనంటూ పడిన నిర్లిప్తత ముందు ఏదైనా దిగదుడుపే !

A K Sastry said...

డియర్ ఆత్రేయ!

ఱంపం యెందుకండీ బాబూ....ఒకటిన్నర మంది అంటే....లారెల్-హార్డీల్లా, మన రమణారెడ్డి-రేలంగిల్లా, మా ఆవిడా-నేనూ లా.....అలా అన్నమాట!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Sujata!

యెంతో ఆత్రంగా వెళ్లే వాళ్లు, తిరిగి వస్తూ--యెందుకొచ్చిన బాధరా భగవంతుడా అనుకొనేలా తయారు చేశారు. అయినా యెవరూ మళ్లీ వెళ్లడం మానడం లేదు--అదీ ఆ దేవుడి మహిమ, దేవస్థానం వాళ్ల కష్టం!

ధన్యవాదాలు.