బా బా బ్లాక్ షీప్
ఓ పాతికేళ్ళ క్రితమే, ఆత్మలింగం పుట్టిస్తూ, దూరదర్శన్ కెమేరా ‘కన్ను’ కి నగ్నంగా పట్టుబడిన శ్రీ సత్య సాయి బాబా, అప్పటినించీ పబ్లిక్ గా మేజిక్కులు చెయ్యడం మానేశారు—అప్పుడప్పుడు ఓ రాజకీయ నాయకుడికి ఓ గొలుసో, వుంగరమో సృష్టించి ఇవ్వడం తప్ప!
నిన్న మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ‘సకుటుంబంగా’ పుట్టపర్తి చేరగానే, ‘అత్యంత అత్మీయ స్వాగతం’ లభించిందట! తరవాత, ఓ మంత్రీ, ఇంకెవరో వారిని ‘సాయి కుల్వంత్’ హాలుకి తీసుకువెళితే, అక్కడ ‘గ్రీన్ రూం’ లో బాబా ఓ పాతిక నిమిషాలు ‘ప్రత్యేక ఆసీస్సులు’ కురిపించారట ఆ కుటుంబం పై!
ఆవిడకి గొలుసులూ, వుంగరాలూ ఇచ్చిన దాఖలాల్లేవు!
రాష్త్రం ఓ స్త్రీ అయితే, దానికి ఓ రాష్త్రపతి వుంటాడు. మరి ఓ స్త్రీ రాష్త్రపతి పదవికి యెన్నికైతే, ఆమెని యేమనాలి? రాష్ట్ర పత్ని అనొచ్చా? కూడదు! యెందుకంటే, ఒక స్త్రీకి మరో స్త్రీ పతిగాని, పత్ని గానీ అవడానికి చాన్స్ లేదు!
ఇంకేమనాలీ? రాష్ట్ర ‘సవితి’ అంటే? అదీ తప్పే!
రాష్ట్ర సోదరి అంటే? మరీ చిన్న పిల్ల అయిపోతుంది! (రాష్ట్ర పురుషులందరికీ)
పోనీ రాష్ట్ర మాత అంటే? మొగ రాష్ట్రపతిని రాష్ట్ర పిత అనాలి!
రాష్ట్ర దొడ్డమ్మ అంటే? ఇదేదో బాగున్నట్టుంది! చూడండి!
మనలో మాట—రాష్ట్ర మాతా లాగే, మన ఆంధ్ర మాత అనుకుంటే, ఆ గౌరవం యెవరికి దక్కుతుంది?
(హిందీలో రాష్ట్ర అంటే దేశ అని, తెలుగులో రాష్ట్ర అంటే మన రాష్ట్ర అనీ అర్ధం)
ఇంకెవరికి—గోంగూరకి తప్ప! (మన ఆచార్య పింగళి గారన్నట్టు)
గోంగూర రాష్ట్ర మాత అయితే, బచ్చలి కూర మన రాష్ట్ర దొడ్డమ్మ!
తోటకూర మన రాష్ట్ర పెద్ద పిన్ని!
మెంతికూర మన రాష్ట్ర చిన్న దొడ్డమ్మ!
చుక్క కూరా, పొన్నగంటికూరా మొదలైనవి చిన్న పిన్నులు!
యెలా వుంది?
2 comments:
పదవులకు స్త్రీ లింగం పు లింగం ఉండవనుకుంటా !
ఎవరైనా రాజకీయనాయకులు పుట్టపర్తి వెళ్ళకపోతే ఆశ్చర్యపడాలిగాని ,వెళితే సామాన్యమైన విషయం కదా.
ఒక విషయం మాత్రం నిజం .ప్రథిభా పాటిల్ is pure rubber stamp.No comarison between kalam and her.
డియర్ అరుణాంక్!
సంతోషం!
ఇంగ్లీషులో కూడా, కొన్ని పదవులకి స్త్రీ లింగాలు వున్నాయి, కొన్నిటికి లేవు! 'డ్యూక్--డచ్చెస్ ', 'ప్రొప్రైటర్--ప్రొప్రైటరెస్ ' ఇలాగ!
అందుకే సరదాగా అలా రాశాను!
నేను వ్రాసింది వాళ్ళు వెళ్ళడం గురించి కాదు--గొలుసులూ, ఉంగరాలూ ఇవ్వక పోవడం గురించి!
అన్నట్టు ఆవిడ కూడా ఈ మధ్య యేదో బిల్లు ని ఆమోదించ కుండా తిప్పి పంపిందటండోయ్!
Post a Comment