సామాన్యుల, బ్లాగర్ల విజయం!
తనకొండకు తానే రప్పించుకొనే శ్రీవారు, తన దర్శనం సామాన్యులకి సులభం గా అయ్యేలాగ తానే పాలక మండలికి సద్బుధ్ధిని ప్రసాదించాడు!
కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
మొదటిది శ్రీవారి మూలబేరానికి వారానికోసారి చేస్తున్న సహస్ర కలశాభిషేకం రద్దు--(గతంలో లాగానే) యేడాదికొకసారే జరిపిస్తామని ప్రకటన.
పరోక్షం గా వొప్పుకున్నారు--మూలబేరం అరిగిపోతోందనీ, రంగు మారిపోతోందనీ! సంతోషం!
అష్టదళపద్మారాధనని కూడా సంపంగి ప్రాకారం లో జరిపిస్తామని--సామాన్యుల దర్శనానికి ఆ సమయం పెరుగుతుంది!
రెండో ముఖ్యమైనది--సెల్లార్, అర్చనానంతర, నిజపాద దర్శనాల రద్దు! మధ్యలో వచ్చినవి మధ్యలోనే పొవాలి, పోతాయి! కదా!
గతం లో లాగే శీఘ్ర దర్శనం టిక్కెట్ల అమ్మకం--రూ. 300/- కి ఒకటి చొప్పున. అదికూడా యేరోజుకారోజు దర్శనం సమయం లోనే విక్రయించడం! చాలా బాగుంది!
మూడోది--సేవల పై కమిటీ నియామకం.
మొత్తానికి మా మొన్నటి శ్రీపతి యాత్ర శుభమే కలిగించింది--సామాన్యులకి!
మన టపాలు మనం లింకులు పంపినవాళ్ళందరూ--ముఖ్యం గా 'చదవలసినవాళ్ళు' చదివారు! ఖచ్చితం గా ఇది బ్లాగర్ల విజయమే!
మనం కృతఙ్ఞతలు చెప్పవలసింది శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్ గారికీ, ఇదివరకటి ఈ వో (ప్రస్తుత పాలక మండలి సభ్యుడు) శ్రీ రమణాచారి గారికీ, చివరగా మా జర్నలిష్ట్ మితృదు 'రమేష్' కీ!
స్వామి ఇంకా సద్బుధ్ధిని ప్రసాదించి, ఇంకొన్ని కీలక నిర్ణయాలు కూడా త్వరలో ప్రకటించబడు గాక!
4 comments:
ప్రస్తుత ఈవో కృష్ణారావు గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి మంచి వ్యక్తి పదవిలోకి వచ్చినరోజునుంచే తితిదేను ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారాయన.రమణారావుగారికి అంత సీను లేదని నా అభిప్రాయం.
Interesting.
I could not follow how it is a victory for bloggers, but good is always good.
డియర్ చిలమకూరు విజయమోహన్!
నిస్సందేహం గా మొదట చెప్పుకోవలసింది ఆయననే! నేను నా ఇదివరకు టపాల్లో ఈ విషయం చెప్పాను కాబట్టి ఇప్పుడు ప్రత్యేకం గా వ్రాయలేదంతే!
ధన్యవాదాలు!
డియర్ కొత్తపాళీ!
'కృష్ణా గోవిందా' లో మొదటినించీ, ముఖ్యం గా 'నీ కొండకు నీవే రప్పించుకో' శీర్షిక క్రింద నేను వ్రాసిన టపాలని శ్రధ్ధగా చదవండి! అప్పటినించీ నేను చెపుతున్నవే ఇప్పుడు జరుగుతున్నాయి అని వొప్పుకుంటారు!
వ్రాశానుగా, చదవవలసినవాళ్ళు ఇవీ (ఇలాంటివి చాలా) చదివేలా చేశారు--లింకులని పంపించేవాళ్ళూ, వ్యాఖ్యాతలూ, ఇతర బ్లాగర్లూ, మీడియావారూ!
అందుకే ఇది బ్లాగర్ల విజయం అనడానికి సాహసించాను!
ఇంకా ముందుగా 'కూడలి' ఓ అద్భుతం కదూ!
ధన్యవాదాలు!
Post a Comment