Sunday, November 1, 2009

శ్రీగిరి శ్రీపతి


ఘంటారావం


శ్రీగిరిపై యెక్కడా గంట వినిపించడం లేదు--ఆలయం లో గంట జాడగానీ, భక్తులెవరూ గంట కొడుతున్న జాడ గానీ లేవని వ్రాశాను ఇంతకు ముందు.  


ఇప్పుడు యేకం గా సాయంత్రం యేడున్నరనించీ ఓ అరగంటపాటు 'ఘంటారావం' పేరుతో 'భక్తి చానెల్ ' లో ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్నారు యేదో ఓ చిన్న గంటని మ్రోగించి!  


గమనించారా?  


అదికూడా నిజం గా గుడిలో మోగిస్తున్నారో, టేప్ రెకార్డు చేసి వినిపిస్తున్నారో నాకు సందేహమే!  


మరి ఆలయం లోని పెద్ద కంచుగంట మోగిస్తే 'గాంగ్.........గాంగ్' అని మోగేది--అదేమయ్యిందో?  

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

శ్రీవారి ఆలయంలోని ఘంటలను స్వామివారికి నైవేద్యసమర్పణ సమయంలో మాత్రమే మ్రోగిస్తారు.

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

ఆ సమయం లో అర్చక స్వాములు యెలాగూ మోగిస్తారు!

నేనన్నది బంగారువాకిలి ముందు ఇదివరకు వుండే పెద్ద కంచుగంట గురించీ, భక్తులెవరూ యెక్కడా యేగంటా మోగించకపోవడం గురించీ!

మరిప్పుడు ఈ అరగంటసేపు ప్రత్యక్ష ప్రసారమెందుకంటారు?

ధన్యవాదాలు!

చిలమకూరు విజయమోహన్ said...

స్వామివారి నైవేద్య సమయాన మ్రోగించేవి బంగారు వాకిలి ముందు ఉన్న రెండు పెద్ద కంచు ఘంటలేనండి.నివేదన సమయంలో ఈ ఘంటలను మ్రోగించే పరిచారక విప్రుణ్ణి ‘ఘంటాపాణి’ అంటారు. ఈ ఘంటల నాదాల తరంగాలు తిరుమల క్షేత్రం అంతటా వ్యాపించి తిరుమల కొండల్లోనూ కోనల్లోనూ మంద్ర గంభీరంగా శ్రుతి సుందరంగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈ ఘంటానాదం చెవినబడ్డ ప్రతివ్యక్తికీ శ్రీ స్వామివారి ఆరగింపు జ్ఞప్తికి వస్తుంది.తిరుమల క్షేత్రంలో ఈ నాటికీ ఈ నాదం ఆగిన తర్వాతనే తమతమ భోజనాలకు ఉపక్రమించే భక్తజనులు ఎందరో ఉన్నారు.ఈ అదృష్టాన్ని లోకానికెల్లా కలిగించాలని అనుకున్నారేమో మరి.

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

మీరిచ్చిన వివరణకి నా ధన్యవాదాలు!

నేను 1975 లో వెళ్ళినప్పుడు ఒకే గంట వుండేదని గుర్తు! మొన్నీమధ్య నేను స్వామిని సందర్శించినప్పుడు ఆ గంట/లు నేను గమనించలేదు! మేము గుళ్ళో వున్నంతవరకు గానీ, కొండ దిగివచ్చేవరకు గానీ గంట వినబడలేదు అన్నది నిజం!

మరి భక్తులెవరూ ఆ గంటలని మోగించడం లేదా? లేక వాళ్ళందరూ 'తోసుకొనే' ధోరణిలో గంటలు వున్నాయనే సంగతే మరిచిపోతున్నారా?! అని నా సందేహం.

ఇక 'ప్రత్యక్ష ప్రసారం' అవుతున్న 'ఒకే గంట ' చాలా చిన్న గంట--పైగా దాన్ని మోగించేవారు మధ్యలో వేళ్ళాడే 'వాదకాన్ని ' (దీన్ని ఇంగ్లీషులో 'హేమర్ '--మన 'సుత్తి ' అంటారు. దానికి సంస్కృతం లో, తెలుగులో యేదైనా పేరు వుందేమో--గుర్తు లేదు) చేత్తో ఒకసారి నెమ్మదిగా, రెండోసారి గట్టిగా 'టంగ్, ఠంగ్...' అని మోగిస్తున్నారు. ఆ పౌనహ్ పున్యాన్ని బట్టి ఆ గంట సైజ్ యెంతో వూహించవచ్చు!

ఇది 'అదృష్టాన్ని కలిగించడమే' నంటారా?

యేమైనా, మీకు మరోసారి నా ధన్యవాదాలు--సమాచారం ఇచ్చినందుకు, 'పరిచారక విప్రుడు ' 'ఘంటాపాణి 'ని పరిచయం చేసినందుకు!