Wednesday, June 17, 2009

........‘మరో నక్క’ వాత!

పులిని చూసి ‘మరో నక్క’ వాత!
మేము శ్రీపతి యాత్రకి వెళ్ళిన రోజునే, మా అమ్మాయి తన అయిదేళ్ళూ, అయిదునెల్లూ వయసు ఇద్దరు కొడుకులతో, వాళ్ళ మామ, అత్తగార్లతో, షిరిడీ సాయి దర్శనానికి వెళ్ళీంది!
వాళ్ళు తరచూ, కనీసం నెలా, రెండునెలలకోసారి వెళుతూ వుంటారు! “తిరుపతిలా కాకుండా, అక్కడ యెంతమంది వున్నా, ప్రతీ ఒక్కరూ నిశ్శబ్దం గా, తనివితీరా, సాయి దర్శనం చేసుకోవడమే కాకుండా, ఆయన పాదాలు స్పృశించడం, చిన్నపిల్లల్ని ఒక నిమిషం ఆయన పాదాల దగ్గర పడుక్కోబెట్టడం, ‘ధుని’ లో వాళ్ళు అర్పణం చెయ్యడం—హాయిగా, సంతృప్తితో తిరిగి రావడం” జరుగుతాయని ఉత్సాహం గా చెప్పేవారు!
మరి ఇప్పుడు—తేడా యేమిటంటే—‘తొక్కేశారమ్మా! చంటి పిల్లలని కూదా చూడలేదు! ఆడవాళ్ళనీ చూడలేదు! ముసలీ, ముతకా కూడా చూడలేదు! అందరూ నలిగి, నలిగి, ప్రాణాలతో బయట పడ్డాము’ అని మా అమ్మాయి ఫోను!
తరవాత, ఇంటికి వచ్చాక, మమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు—“ఇదివరకు కేవలం ఒక్క మనిషే పట్టేలాగ క్యూ లైన్లు వుండేవి! ఇప్పుడు ముగ్గురు నలుగురు ఒకేసారి వెళ్ళిపోయేలాగ, క్యూ లైన్ల వెడల్పు పెంచేశారు! బాబా దగ్గరకి వెళ్ళనివ్వడం లేదు! పాద స్పర్శ దేవుడెరుగు! బయటినించే గెంటేస్తున్నారు! అంతా గోల గోల!”
అదండీ సంగతి!
వీళ్ళు మూర్ఖులా? వాళ్ళు మూర్ఖులా? ప్రజలూ, భక్తులూ మూర్ఖులా?
వాడు కూడా ‘డబ్బు సంపాదన’లో పడ్డాడా? యెవరికి వడ్డీలు కట్టడానికి?
తేల్చుకోండి!

2 comments:

Anonymous said...

గురువు గారు, ఏంటో మీ గోల. ఒక్క ముక్క అర్ధం కాలేదు.

"వాడు కూడా ‘డబ్బు సంపాదన’లో పడ్డాడా? యెవరికి వడ్డీలు కట్టడానికి? " ఇప్పుడు ఎమంటారు? ఆంటే శిరిడీ సాయినాధుడు డబ్బు సంపాదనలో పడ్డాడు అనా? ఇంతకంటే మూర్ఖత్వం ఏమీ లేదు. సాయినాధుడు సజీవంగా ఉన్న రోజుల్లో ఆయన ఒక్కరోజులో పేదలకి పంచే డబ్బులు ఆ కాలంలో బ్రిటీష్ గవర్నరు జీతానికి సమానంగా ఉండేది అంట. ఇంత పెద్ద మనుషులు మీరు కూడా ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. This is utter foolishness.

-Vijay

సుజాత వేల్పూరి said...

ఎక్కడినా ప్రజల్లో మూర్ఖత్వం పోతే గానీ ఏమీ లాభం లేదండీ! శిరిడీ సాయినాధుడు సజీవంగా ఉన్నపుడే బిందెతో బంగారం పంపిన మహారాణి ని ఆ క్షణాన్నే వెనక్కి పంపినవారు.ఆయన డబ్బు సంపాదనలో పడ్డాడా అంటే ఏం చెప్తాం?

మీ వాళ్ళు చేసిన కంప్లెయింట్స్ అన్నీ నిజమే! ఒక్కటి కూడా అబద్ధం కాదు. నేను పదేళ్ళనుంచీ ప్రతి ఏడాది రెండు సార్లు తప్పకుండా శిరిడీ వెళ్తున్నాను.పదేళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. కాకడ ఆరతికి తెల్లవారుజామున నాల్గింటికి వెళితే హాయిగా దగ్గరుండి హారతి అటెండ్ అయిన ఫీలింగ్ ఉండేది ఇదివరలో.ఇప్పుడు రాత్రి శేజారతి అవగానే వెంటనే కాకడ ఆరతికి క్యూ మొదలవుతోంది. మరి జనం లక్షల్లో వస్తుంటే ఏం చెయ్యమన్నారు?

"నాకు బంగారం సింహాసనం కావాలి, కిరీటాలు కావాలి,బంగారు పాదాలు కావాలి" అని సాయి అడిగారా? డబ్బులిచ్చే భక్తులున్నారు కదాని సంస్థాన్ వాళ్ళు అవన్నీ చేయించి పెట్టారు. మరి సాయి పాదుకలకంటే వాటికి వేసిన బంగారపు తొడుగుకు విలువ ఎక్కువైపోయింది కదా, అందుకే పాదాలు కాకడ ఆరతి సమయం లో తప్ప ముట్టుకోనివ్వడం లేదు అరిగిపోతాయని కాబోలు.ఇదివరలో సమాధి కూడా ముట్టుకునే అవకాశం ఉండేది.

బట్టలు మొదలైనవాటితో పాటు పెద్ద పెద్ద బంగారు హారాలు ఆయనకు కానుకలు ఇవాళ.వాటికోసమైనా రెట్టింపు సంఖ్యలో సెక్యూరిటీ వాళ్ళు! ఇదివరలో సెక్యూరిటీ వాళ్ళు అసలు విసుక్కునేవారు కాదు, ఇప్పుడు జనం తొక్కిడి ఎక్కువై లాగి అవతల పడేస్తున్నారు.

ఇక మనవాళ్ళు(ప్రత్యేకించి ముఖ్యంగా తెలుగువాళ్ళు) ధునిలో అడ్డమైన వస్తువులన్నీ పడేస్తున్నారు. కొబ్బరికాయలూ,సాంబ్రాణితోపాటు వాటి కాగితాలూ, దారాలూ, తాళ్ళూ ఏమిటేమిటో...!అందుకే మొత్తం ధుని అంతటికీ రేకు మెష్ అడ్డం పెట్టేసి అందరి రోగం కుదిర్చారు.

ఇందులో ఎవర్ని తప్పుపడతాం చెప్పండి? రావొద్దని జనానికి చెప్తామా? టెర్రరిస్టులు వీధిబిచ్చగాళ్లంత సహజంగా తిరుగుతున్న రోజుల్లో సెక్యూరిటీ వద్దని, క్యూలు వద్దనీ, ఫ్రీగా దర్శనం అయ్యేలా చూడాలనీ సంస్థాన్ వాళ్ళని కోరగలమా? సాయి కి డబ్బంటే లెక్కలేదు కాబట్టి వచ్చి పడే డబ్బు, బంగారాలని తీసుకోవద్దని చెప్పగలమా? ఇదొక vicious circle! దీనికి సిద్ధమైతే శిరిడీ వెళ్ళాలి, లేకపోతే లేదు.

సులభ దర్శనానికి ఒక కిటుకు!

సాయంత్రం నాల్గింటికి క్యూలోకి వెళితే సంధ్య హారతికి వెళ్ళేవాళ్ళని, ఒక పక్కన ఆపేస్తూ, కేవలం దర్శనానికి వెళ్ళేవాళ్లని వెంటనే పంపేస్తారు.సరిగ్గా పదిహేను నిమిషాల్లో దర్శనం ముగించుకుని బయటికి రావచ్చు. స్నానం చెసి రావాలని, భోజనం చేయకుండా రావాలని పట్టింపులు సాయికి లేవు కనుక పిల్లలతో వెళ్ళేవాళ్లకు ఇది ఉత్తమమమైన పద్ధతి!