Monday, June 22, 2009

షిరిడీయో, శ్రీపతో.....

‘……..యేమి చెయ్యాలి?’—3
ఇక రెండోదీ, ముఖ్యమైనదీ అన్నాను—అదేనండీ—మన వీ ఐ పీ ల బెడద!
దీనికేమి చెయ్యాలంటే, వీళ్ళకి ఒక స్థాయిని నిర్ణయించాలి—ఫలానా పదవిలోగాని, దానికి సమానమైన పదవిలోగానీ, అంతకు యెక్కువ హోదాలో వున్నవాళ్ళు మాత్రమే వీ ఐ పీ లు అని నిర్ధారించాలి! వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప, యెంత ముఖ్యులని చెప్పుకున్నా, వాళ్ళ తైనాతీలనీ, చెంచాలనీ, మందలనీ నిర్మొహమాటం గా మామూలు క్యూలకి పంపించాలి!
అంతే కాదు—వీళ్ళకి ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయం, ఓ గంటో, రెండు గంటలో—కేటాయించాలి. ఆ సమయాల్లో తప్ప, సాక్షాత్తూ దేశ ప్రథానీ, అధ్యక్షుడూ/రాలూ వచ్చినా, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా, ఇంతెందుకు బ్రహ్మ రుద్రాదులైనా, తరవాతి నిర్ణీత సమయం కొరకు వేచి వుండాలిసిందే!
ఆ సమయాల్లో, తనంతట తానే కదిలే ‘ట్రెడ్ మిల్’ కి ముందే సామాన్య క్యూలోని భక్తులని ఆపెయ్యచ్చు!
గర్భగుడిలోకీ, మూలబేరం ముందుకీ అర్చక స్వాములకీ, అలంకరణలు చేసేవాళ్ళకీ తప్ప ఇంకెవరికీ (ధ్యానం లో కూచుంటాను అనే వాళ్ళ లాంటి వాళ్ళకి) ప్రవేశం వుండ కూడదు!
ఇలా చేస్తే, లఘు, వీరలఘు, మహలఘు, మహావీరలఘు లాంటి వాటి అవసరం వుండదు!
కనీసం 80 వేల మంది తృప్తిగా స్వామిని దర్శించుకోగలరు!
అవునా, కాదా?

6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీరేంటి స్వామీ ఇలాంటి సలహాలిస్తారు ? మేముండేది శ్రీవారి సేవకు కాదండి, VIP ల సేవలో మమేకమై ఆయన హుండీలో వేసేదానికన్నా ఎక్కువ సంపాదించేదానికి.

సుజాత వేల్పూరి said...

వీ ఐ పీ ల తో పాటు వచ్చే మందలన్నింటినీ మామూలు క్యూల్లోకి మళ్ళించాలా? జరిగే పనేనాండీ? ఎమ్మెల్యే గారిచ్చే రికమండేషన్ ఉత్తరంతో సగం క్యూ గడిచాక అక్కడినుంచీ వెళ్ళి మనం క్యూలో కల్సే ఏర్పాటుంది. కనీసం వాటిల్లో కలిపే ఛాన్సుంటే పది వేలు!

మీరు ఇంకో కేటగిరీని మర్చిపోయారు. సినిమా వాళ్ళు. ఊ అంటే పరిగెత్తుకుని తిరుపతి వెళ్తుంటారుగా. సినిమా ముహూర్తానికి, ఆడియో రిలీజ్ కి, సినిమా రిలీజ్ కి ఇలా! వాళ్ళు వచ్చినపుడు సామాన్య భక్తుల్ని క్యూలో గంటల తరబడి ఆపేసే హక్కు దేవస్థానానికి ఎందుకుండాలో చెప్పండి? వాళ్ళు ఏ రకంగా గొప్ప? వాళ్ళ వెనక పరిగెత్తే మీడియా వాళ్ళు, సెక్యూరిటీ వీటన్నింటివల్ల ఎంత మందికి టైమ్ వేస్టు, ప్రయాస?

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

బగా చెప్పారు!

కాని, కొంచెమైనా మార్పు తేవడానికి ప్రయత్నిద్దాం!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ సుజాత!

ఒక విషయం ఆలోచించండి!

నేనుకూడా, మా అమ్మాయి పెళ్ళిచేశాక, వాళ్ళిద్దరూ శ్రీపతి దర్శనానికి వెళ్ళొస్తామంటే, ముందు ప్లాన్ చేసుకోకపోయినా, మా స్టేషను మాష్టారి ద్వారా రైలు రిజర్వేషన్లూ, మా స్థానిక మంత్రిగారిదగ్గర ఒక లేఖా, మా వూరిలో వున్న శ్రీగిరిలో ఒక కాటేజీ కట్టించిన ఒక దాత దగ్గర ఆ కాటేజీ కేటాయింపుకై ఒక లేఖా, దేవస్థానం లో పనిచేసే ఒక కొంచెం పెద్ద స్థాయి ఉద్యోగినికి వాళ్ళ సోదరుడిచేత ఫోనూ చేయించి, పంపించాను!

వాళ్ళు తిరిగి వచ్చాక, యెంత దివ్యంగా, ప్రయాసరహితం గా దర్శనమూ అవీ అయ్యాయో చెప్పి, చాలా సంతోషించారు!

మరి, యే ప్రయాసా లేకుండా రోజూ ఓ 80 వేల మందికి 'తృప్తిగా' దర్శనం అయిపోతుందంటే, ఇంకెవరండీ ఎం ఎల్ యేలనీ, నాయకులనీ దేబిరించేది?

ఇక సినిమావాళ్ళంటారా--వాళ్ళ సెంటిమెంటు వాళ్ళది! ఒకసారి సామాన్యుల దర్శనాలు ఓ పధ్ధతిలోకి వచ్చాక, ఇవన్నీ చిన్న సమస్యలయిపోతాయి!

ఆవునా!

ధన్యవాదాలు!

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Dear Krishnasree,

I think you are an ex bank employee, so you will have all these contacts, what about the common people who will come all the way to have the darshan and will be suffering like hell which will greatly affect their devotion. I strongly feel that we should come out of these comfort zones and think realistically.

My 0.02$
-Ganesh.

A K Sastry said...

Dear Venkata Ganesh. Veerubhotla!

A small correction! I am not an ex but still am a Bank employee!

My endeavor right from the beginning is to impress upon the readers about the need to maintain 'the lord' as common man's God only!

please read all my posts!