Thursday, June 18, 2009

'సోమరాజో, కామరాజో....'

డియర్ సుజాత! చాలాసంతోషం—ప్రజల్లో మూర్ఖత్వం పోవాలనే మీ ఆలోచనకి!
‘….సజీవంగా వున్నప్పుడు…..’ కి నా కొత్త టపాయే జవాబు (శ్రీ vibey కిచ్చినది)!
‘కాకడ ఆరతి’ ‘శెజారతి’—ఇలాంటివేమిటో నాకు తెలియదు!—‘మరి లక్షల్లో జనం వస్తూంటే యేం చెయ్యమన్నారు?’ అన్న మీ ప్రశ్న, అక్షర లక్షలు విలువ చేసేది!
(దీనికి జవాబు నా మరో టపాలో!)
‘ఇచ్చే భక్తులున్నారుకదాని…..’ అన్నదానికి, ‘గాలి దాతృత్వం’ మీద మా డ్రైవర్ కామెంటే జవాబు!
('పాదుకలికి కంటే, వాటికి వేసిన బంగారపు తొడుగులకి’ అంటే, సాయికి పాదుకలకీ, బంగారానికి తేడా తెలియకపోయినా, సంస్థాన్ వాళ్ళకీ, భక్తులకీ వాటి విలువ తెలుసు కాబట్టి, అవెక్కడ జనాలు ‘గోక్కుపోతారోనని’ భయమేమో! అరిగిపోతాయని కాదు!)
‘బట్టలు’ పెద్ద పెద్ద కానుకలు కాదు! అవి కూడా లేనివాళ్ళకిస్తేనే అవి కానుకలవుతాయి!
‘పెద్ద పెద్ద బంగారు హారాలు—వాటి కోసమైనా సెక్యూరిటీ—(!!!!?)!......'
వీటికేమైనా లెఖ్ఖా పత్రాలూ, కల్పించిన భద్రత వివరాలూ యేమైనా వున్నాయా? యెవరికైనా తెలుసా?
యెందుకు యేటేటా ప్రకటించరు—కంపెనీల నివేదికల్లాగ?
పైగా ‘లాగి పడేస్తున్నారు '—అని సంతోషమా!
(అంటే అవన్నీ క్యూల పక్కనే ప్రదర్శనకి వుంచారా? యెందుకు? వాటి సెక్యూరిటికోసమే లాగి పడేస్తున్నారా?)
(మిగతా తరవాత!)

2 comments:

సుజాత వేల్పూరి said...

కృష్ణశ్రీ గారు,
జవాబుగా మీరొక టపాయే రాశారా! బాగుంది.

సాయి బాబా ఆడంబరాలను సజీవంగా ఉన్నపుడు లెక్క చెయ్యలేదని చెప్పడానికే ఆ ఉదాహరణ వాడాను. బంగారం తాగిన సంగతి నాకు తెలీదు.ఆయన సజీవంగా ఉన్నపుడు కూడా జనం కుప్పలు తెప్పలుగా రావడం మొదలెట్టాక చుట్టూ ఉన్న ముఖ్య భక్తులు వేరే చోట్లనుంచి వచ్చేవారి నుంచి 'డబ్బు" వసూలు చేసి దర్శనం త్వరగా కల్పించడానికి వీలు కల్పించేవారని ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన ఒక పుస్తకంలో చదివి ఏమనాలో తెలీలేదు. ఇక ఈ రోజుల్లో ఒక లెక్కంటారా?

అసలు షిరిడీలో ఈ బంగారం గోల ఏమిటనేది నాకు అసంతృప్తిని కల్గించే విషయం! ఈ రోజు పేపర్లో చూశారా మీరు? త్వరలో గుడికి బంగారు తాపడం చేయడానికి భక్తులెవరో ఇచ్చిన కోట్ల డబ్బు ఖర్చు చేయబోతున్నారట.గోపురానికి బంగారు తాపడం!!

నాకు తెలిసినంత వరకూ షిరిడీ సంస్థాన్ స్వతంత్ర ప్రతిపత్తి కల్గి ఉంది. ఎండోమెంట్స్ కింద లేదు. అలా అయినా భక్తుల సమాచారం కోసమైనా ఖర్చులు, ఆదాయాలు ప్రకటించాలని నేనూ చాలా రోజులనుంచీ ఎదురు చూస్తున్నాను.

మరి ఇక్కడ కూడా ముంబాయి నుంచి వచ్చే సినీ ప్రముఖులకు, గుడి వెనకనుంచి క్షణంలో వెళ్ళి తమ దర్శనాన్ని బాబాకు అనుగ్రహించే సదుపాయం ఉంది, రెండు మూడు నెలల పిల్లలు చెమటలొ, ఉక్కలో, వేడిలో నలిగిపోతూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నా సరే!

ఇక జనాన్ని లాగిపడేసేది...!పడేయకపోతే ఎవరూ అక్కడినుంచి కదలరండీ! వెనక వచ్చేవారికి అవకాశం లేకుండా విగ్రహం ఎదురుగా పాతుకుపోయి వారొక్కరే అక్కడ ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు.(చెప్పానుకదండీ, పదేళ్ళుగా వెళ్తున్నాను.ఎంతమందిని చూసి ఉంటాను)

ఇప్పుడు విగ్రహం చుట్టుపక్కలంతా బంగారం మయం!(ఆర్థిక మాంద్యమెక్కడుందో మరి దేవుడికే తెలియాలి)అంత బంగారానికి సెక్యూరిటీ ఇవ్వాలంటే బోలెడు మంది సెక్యురిటీ వాళ్ళు, వాళ్ళు లాగిపడేయడాలూ రెండూ అవసరమే!

ఈ పై విషయాలన్నింటికీ మూలం .."ప్రజల్లో మూర్ఖత్వం" కాక మరేమిటి?

అన్నట్లు, ఈ రోజు మీ పెళ్ళిరోజని ఇందాకే "నీ కొండకు నీవే రప్పించుకో"చదువుతుంటే తెలిసింది. శుభాకాంక్షలండీ మీ దంపతులిద్దరికీ!

A K Sastry said...

డియర్ సుజాత!

నిజం గా చాలా సంతోషమమ్మా మీ అభినందనకీ, మీ మరో కామెంట్ కీ!

దాదాపుగా నా అభిప్రాయాలతో యేకభివిస్తూ వ్రాసినందుకు మరోసారి ధన్యవాదాలు!

'భక్తులు ' యెంత ఘోరం గా తిడతారో అనుకుంటూ బ్లాగ్ తెరిచిన నాకు మీ కామెంట్ స్వాతి వానలా అనిపించింది!

ధన్యవాదాలు!