Thursday, May 19, 2011

వేద పాఠశాల




"......క" వేధింపులు

తిరుమల "వేధ" (ఇలాగే అంటున్నారు ప్రతీ వి & ఎం న్యూస్ రీడర్లూ, రిపోర్టర్లూ!) పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయట. 

ఇప్పుడు బయటికి వచ్చిందిగానీ, ఓ మూడు నెలల క్రితమే మన ఈవో కృష్ణారావుగారు దర్యాప్తు చేయించి, నలుగురు సీనియర్ విద్యార్థులనీ, ఓ అధ్యాపకుణ్నీ ఇంటికి పంపించేశారట! క్లైమాక్స్ అయిపోయాక వచ్చే పోలీసుల్లా మన మీడియావారూ తయారయ్యారు! ఆ తండ్రిని అలా ప్రశ్నించి, ఆయన గుడ్లనీళ్లు కుక్కుకుంటుంటే, జాలి తప్ప మనం యేమి పడగలం?

అసలు 150 మందికి సరిపోయే పాఠశాలలో 800 మందికి పైగా యెలా చేర్చుకొన్నారు? "ఇకనుంచీ" ప్రవేశాలు యెందుకు ఆపేశారు? ఇప్పుడు వున్నవాళ్ల సంగతేమిటి?

కృష్ణారావు ని యెక్కడికి పంపించాలా అని ఆలోచిస్తూందట ప్రభుత్వం--ఇవాళే టీవీలో విన్నాను.

మరింకేం! మీ తైనాతీనొకణ్ని వేస్తారో, మళ్లీ బోర్డుని పునరుధ్ధరించి, కావూరి నే వేస్తారో--కానివ్వండి! 

మా సామాన్యులకి పోయేదేమీ లేదు--శ్రీవారి దర్శనం తప్ప! (ఆ తరవాతేమి చేస్తారో మీ యిష్టం!)

(సున్నితమైన విషయాలని పబ్లిసిటీ చేసి, పసివాళ్లమీద ప్రభావం కలిగించచ్చా? అంటూ ఇవాళ (20-05-2011) రాత్రి 8-00 గంటలకి భక్తి ఛానెల్లో ఓ కార్యక్రమం ప్రసారం చేస్తారట. అందులో యేమి చెబుతారో చూడాలి మరి. సరిగ్గా ఆ సమయానికే మాకు కరెంటు పోతుంది!)


2 comments:

Anonymous said...

ఆ దరిద్రుడు పదవిలోకి వచ్చి దేవస్థానాన్ని ఒక తాగుబోతు సారా వ్రాపారికి ధారాదత్తం చేశాడు. అప్పటి నుండి అక్కడ రాక్షస రాజ్యం ఐపోయింది. ఉద్దేశ్యపూర్వకంగా అటువంటి అధ్యాపకులను అక్కడ వాళ్ళు నియమించారు.
వాడి ఆరేళ్ళ పాలన పర్యవసానాల్ ఒక్కక్కటీ అందరూ కొన్నితరాల వరకు అనుభవించక తప్పదు. నరకాసురుడు చచ్చినా మళ్ళీ దేశాన్ని ఆ వారసులతో బ్రష్టుపట్టించాలని బుద్దిహీనుల ప్రయత్నాలు.

A K Sastry said...

పై అన్నోన్!

అనుకొని యేమి లాభం.....మనం చెయ్యగలిగింది చెయ్యడమే!

తరవాతి టపా కూడా చదవండి.

ధన్యవాదాలు.