Monday, June 8, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--3

ఇక ఇతర విషయాల మీదకి మళ్ళింది సంభాషణ. నా ఇదివరకటి యాత్రల గురించి చెప్పగానే, రాజేష్, ‘మరీ ముఫ్ఫై యేళ్ళా! వడ్డీ భారం పెరిగి పోతుంది కదా సార్! నేను మాత్రం నెల విడిచి నెల ఠంచన్ గా వచ్చేస్తాను! ఏప్రిల్ 26 న వచ్చాను, మళ్ళీ ఇప్పుదు వచ్చాను! ఇలా వస్తూనే వుంటాను!’ అన్నాడు. నేను, ‘స్వామి వడ్డీ కడతానన్నాడు కుబేరుడికి—నేనైతే వడ్డి కూడా చెల్లించనని తెలుసాయనకి!’ అన్నాను. ఉమేష్ ‘నేను వచ్చి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయ్యింది—మళ్ళీ ఇప్పుడు వచ్చాను’ అన్నాడు. తరవాత, అప్పటికీ, ఇప్పటికీ తేడాల మీద సాగింది సంభాషణ. కొండమీద టొల్ గేటు చేరగానే, మా గైడ్ మాకు యేమిచెయ్యాలి, దర్శనం అయ్యాక యెక్కడ కలవాలి, అన్నీ చెప్పి, మమ్మల్ని సెల్లార్ లో చేర్పించి, తను వెళ్ళిపోయాడు, మా టిక్కెట్ లు మాకిచ్చేసి. రెండునెల్లకోసారి వచ్చే రమేష్ పుణ్యమాని, మేము త్వర త్వరగా ఆ క్యూ లైన్ లో నడుచుకుంటూ, వెళుతున్నాము.

2 comments:

శ్రీ said...

బాగుంది. పనిలో పనిగా మా కాళహస్తి చూసారా?

A K Sastry said...

డియర్ శ్రీ!

అసలు ఇప్పుడే నేను ప్లాన్ చేసింది 'తిరుపతి, శ్రీ కాళహస్తి, కాణిపాకం--మూడు రాత్రులూ, రెండు పగళ్ళూ' ప్యాకేజీ టూర్ కి. పొరపాటున 'తిరుపతి, మంగాపురం--రెండు రాత్రులు, ఒక పగలూ ప్యాకేజీ టూర్ కి బుక్ చేశాను! దానికే అడ్జస్ట్ అయ్యాము!

వీలైతే మరోసారి తప్పకుండా!