నేను వెనకనించి ‘ఇంక నడువమ్మా—లేక పోతే తోసేస్తారు—అక్కడ యెడమవైపుకి తిరుగుతూ, మెట్టుదిగు’—అని చెప్పి ఆవిడని రక్షించాను! ఆవిడ వెనకే నేనూ, వెనక మా ఆవిడా, మిగతావాళ్ళూ—రెండు నిమిషాల్లో బయటికి వచ్చేశాము.
ఇక్కడ, 1979 లో మేము చేసుకున్న దర్శనం సమయం లో ఓ చిన్న సరదా విషయం!
చెప్పానుగా, అప్పుడు శ్రీవారి గర్భగుడివరకూ వెళ్ళి, ఆ ద్వారం ముందు ఓ క్షణం నించొని కనులారా దర్శనం చేసుకొని, నమస్కరిస్తూనే, కుడివైపు తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళం! కొంతమంది, ఇంకా తనివితీరక, వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, నెత్తిమీద దణ్ణం పెడుతూ, తిరిగి వెళుతూండేవారు!
అప్పుడు కూడా, ఆ రెయిలింగు వెనక, ఇద్దరు ముగ్గురు ‘ముండలూ, వెధవలూ’ వుండేవాళ్ళు!
ముందు నేనూ, నా వెనకాల మా షేహితుడు, తరవాత మిగిలిన వాళ్ళూ—కదులుతూ వుండగా, ఒక ‘ముండ’ యెక్కడా ఆగకుండ అరుస్తూనేవుంది—‘కదలాలి, కదలాలి. ఒక్కొక్కళ్ళూ అంతసేపైతే కుదరదు—‘ అంటూ వాగుతూనే, మాముందు వెనక్కి వెళ్ళిపోతున్నవాళ్ళలో ఒకాయన వెనక్కి తిరిగి చూస్తూ వెళుతుంటే, ‘ఇదుగో! ఇంక అటు తిరుగు—నడువు—లేకపోతే మెడ అలాగే వుండిపోగలదు!’ అని వేళాకోళం చేస్తుంటే, నాకు వొళ్ళు మండింది.
అప్పట్లో నేను సరదాగా ‘వెంట్రిలాక్విజం’ అభ్యసించేవాడిని, సరదాగా మా స్నేహితులదగ్గర నా విద్యని ప్రదర్శిస్తూండేవాడిని!
నాకు వొళ్ళు మండగానే, అప్పటికి సరిగ్గా గర్భగుడి ముందునించి కుడివైపు తిరుగునున్నానేమో, గంభీరం గా, నా పెదవులు కదలకుండా, ‘నువ్వు నోరు ముయ్యవే!’ అన్నాను—గుడిలోని అర్చక స్వాములు కూడా ఆశ్చర్యంగా స్వామివారివైపు చూశారు!—సాక్షాత్తూ స్వామే మందలించారా అని!
క్యూలో వాళ్ళందరూ ఒకసారి గొల్లున నవ్వు! నా వెనకున్న మా స్నేహితుడైతే, బయటికి వచ్చేవరకూ కిసుక్కూ, కిసుక్కూ నవ్వుతూనే వున్నాడు! ఆ ముండ కంగారు పడిపోయింది—యెవరు? యెవరూ? అని అరిచి ఒక్కసారి సైలెంట్ అయి పోయింది!
మా స్నేహితుడు, బయటికి హుండీ వైపు వెళ్ళడానికి తిరగ్గానే, ‘మీరే కదూ! అవునా! భలే అన్నారండీ! అందరూ స్వామివారే అనుకున్నారు! భలే అన్నారండీ—నువ్వు నోరు ముయ్యవే!—అని!’ అని ఇమిటేట్ చేస్తుంటే, నేను ‘ష్!’ అన్నాను—యెక్కడ బయట పడిపోతానో అని!
ఇప్పటిక్కూడా, మా స్నేహితుడు అది తలుచుకునీ, అందరికీ చెప్పీ, పడి పడి నవ్వుతూనే వుంటాడు! ‘నువ్వు నోరు ముయ్యవే!’ అని చక్కగా ఇమిటేట్ చేస్తూ!
8 comments:
డియర్ చదువరులారా!
నా పాత టపాల లోని 'డైరీ' ని చూస్తూ వుండండేం!
అది యెప్పటికప్పుడు అప్ డేట్ అవుతూంటుంది మరి!
"వాళ్ళు" అప్పటి నుండే ఉన్నారా?
హ్హ హ్హ హ్హ! భలే కొట్టారు దెబ్బ. మీర్రాసినవన్నీ క్రమం తప్పకుండా చదువుతుంటాను. కానీ వ్యాఖ్యానించాలంటేనే ఎక్కడలేని బధ్ధకం. ఇదిగో, ఇలాంటి చమక్కులే నాలాంటి వాళ్ళ బధ్ధకాన్ని వదిలించి కామెంటు వ్రాసేలా చేస్తాయి :)
డియర్ Panipuri123!
వున్నారు బాబూ! వున్నారు!
వుండడమేకాదు! పెరుగుతున్నారు!
అప్పటి అమ్మాయి ఇప్పటికి పిల్లల తల్లీ, అమ్మమ్మా, మామ్మా అయి వుంటుంది! కానీ తన వారసులని కొనసాగిస్తోంది గుడిలో!
విషయం అందరికీ తెలియాలనే నేను వ్రాస్తున్నది!
ధన్యవాదాలు!
డియర్ అగ్ని! బ్లాగాగ్ని!
ఆహా! చాలా సంతోషం!
బధ్ధకించకుండా వ్రాయబట్టే కదా అందరికీ తెలిసేది!
ఇక ముందుకూడా వ్రాస్తూ వుండండి!
ధన్యవాదాలు!
డియర్ చదువరులారా!
అతి క్లుప్తంగా కాకుండా, మీ వ్యాఖ్యలు వివరంగా, నిర్మొహమాటం గా వ్రాస్తే, ఇంకా సంతోషిస్తాను!
మీ ద్వారా ఇంకొందరికి ఇవి చేరితే, కొంత మార్పు రావచ్చు! అవునా!
ధన్యవాదాలు!
> అతి క్లుప్తంగా కాకుండా, మీ వ్యాఖ్యలు వివరంగా, నిర్మొహమాటం గా వ్రాస్తే, ఇంకా సంతోషిస్తాను!
ప్రొఫైలో లో మీ ఫోటో చూసి, మీరు పెద్దవారు కదా, అందుకని కామెంట్స్ ని అతి క్లుప్తంగా వ్రాస్తున్నారేమో?
రెండేళ్ళ క్రితం తిరుపతిలో జరిగిన స్వామి దర్శనానుభవం గుర్తుకొచ్చింది మీ పోస్టు చదివి. ఆ మందలో మానరక్షణ పాట్లు తప్ప శ్రీవారి దర్శనం పైన ధ్యాస నిల్పడమే కుదరదాయే! కాణిపాకం అనుభవం ఇంకా ఘోరం. అక్కడి వెధవలైతే చెయ్యెట్టి తోసెయ్యడమే..
ఇంకో సారి తిరుపతి వెళ్ళాలీ అనుకోవాలంటేనే భయంగా ఉంది.
Post a Comment