కలియుగ దైవం పిలిచింది!1975 జూన్ 19 న నా వివాహం అయ్యాక, మా మామగారి మొక్కుబడి తీర్చడం కోసం, పసుపుబట్టలతో ఆ నెల ఆఖరి వారం లో మా దంపతులం వెళ్ళాం—కలియుగ దైవం దర్శనానికి! తరవాత, 1979 లో మా స్నేహితుడి అన్న పెళ్ళికి చెన్నై వెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు, మా స్నేహితుడితో మరోసారి వెళ్ళాను ఆయన దర్శనానికి ఆ స్నేహితుడికి కంపెనీ కోసమని! మళ్ళీ మొన్న, 03-06-2009 న బయలుదేరాము—మా దంపతులం! (ఐ ఆర్ సీ టీ సీ వారి ప్యాకేజ్ పుణ్యమాని!) నా అనుభవాలు—వివరంగా—చదవండి! రైలు శ్రీపతి చేరుతుందనగా, వారి ప్రతినిధి నించి ఫోన్—ఒక్క ఐదు నిమిషాలు వేచి వుండండి ప్లాట్ ఫాం మీద—నేను వస్తున్నాను—అని! మేమిద్దరం కాకుండా ఇంకొక యువకుడు—వేచి వుండగానే, ఆ ప్రతినిధి వచ్చి, మాకు ఇవ్వవలసిన పత్రాలు ఇచ్చి, యేమి చెయ్యాలో చెప్పి, బయట టాక్సీ దగ్గరకి మమ్మల్ని తోడ్కొని వెళ్ళి, అక్కడ ఇంకొక ప్రతినిధి (గైడ్) కి మమ్మల్ని అప్పచెప్పి వెళ్ళిపోయాడు—మీరు తిరిగి వచ్చేటప్పటికి మీకోసం యెదురు చూస్తూ వుంటాను మళ్ళీ రైలు లో మిమ్మల్ని సాగనంపడానికి—అని చెప్పి! అప్పటికి ఉదయం 6.40 అయ్యింది. టాక్సీ లో మమ్మలని తీసుకెళ్ళి, ‘శ్రీనివాసం’ అతిథి గృహం లో మాకు బస యేర్పాటు చేసి, ఫలహారాలకి చీటీలు ఇచ్చి, ‘8.45 కల్లా సిద్ధంగా వుండండి—కొండపైకి వెళదాం’ అని చెప్పి, గైడ్ వెళ్ళాడు—మరొకర్ని స్వాగతించడానికి! మేము స్నానాలు, ఫలహారాలు కానిచ్చి, క్రిందకి వచ్చి, శ్రీనివాసం అతిథి గృహాన్ని ఓ సారి పరిశీలించి, సిద్ధంగా వుండగా, గైడ్, ‘ఇంకో ప్రయాణీకుడు వస్తున్న రైలు ఆలస్యం అయ్యింది సార్! ఇప్పుడే వచ్చింది! ఆయన కూడా సిద్ధం అవగానే, కలసి వెళ్ళిపోదాం—కొన్ని నిమిషాలు వేచి వుండండి’ అన్నాడు. మేము ముగ్గురం వేచి వుండగానే, నాలుగో ఆయన (ఇంకో నవ యువకుడు) రావడం, మేము నలుగురూ, గైడ్ తో కలిసి అయిదుగురం టాక్సీ యెక్కి—10.30 కి కొండపైకి బయలుదేరాము.
సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
2 comments:
అయిపోయిందా? మిగతా రాస్తారా?
డియర్ శ్రీ!
అప్పుడే అయిపోయిందా! ఇంకా చాలా వుంది మరి!
Post a Comment