Sunday, June 7, 2009

నీకోండకు నీవే రప్పించుకో--2

మచిలీపట్నం—తిరుపతి ఎక్ష్ ప్రెస్ లో మా దంపతులతోపాటు వచ్చిన విజయవాడ వ్యాపారి (పేరు ‘ఉమేష్’ అందాం!) తో ముగ్గురం అంబాసిడర్ వెనక సీట్లో కూర్చున్నాము, ముందు సీట్లో గైడ్ పక్కన ఇంకో నవయువకుడు—ఈయన ఓ ఫ్రీలాన్స్ జర్నలిష్ట్ అట—ఇండియన్ ఎక్ష్ ప్రెస్ కి యెక్కువగా వ్రాస్తూ వుంటాడట! (పేరు ‘రమేష్’ అందాం!)—కూర్చొన్నారు. రమేష్ వేడి వేడిగా టాపిక్ మొదలు పెట్టాడు—‘కరుణాకరరెడ్డి శ్రీవారి ఆభరణాల ఎగ్సిబిషన్ పెడతానన్నాడు కదా? యెందుకు పెట్టలేదు? యెందుకు పెట్టనివ్వలేదు?—వాటిల్లోని ఖరీదయిన వజ్రాలని లేపేశారు సార్!’ అని. ‘అసలు కారణం అది కాదు! మనపోలీసులు తగిన రక్షణ కల్పించలేమన్నారు కదా? ఇది పైకి కనిపించే, చెప్పే కారణం! నిజం గా కూడా, అన్ని టన్నుల బంగారానికి ‘ఫోర్ట్ నాక్స్’ కి వున్నంత భద్రత కల్పించాలి మరి! ఇక అసలు కారణం, 1933 నించీ, శ్రీవారికీ, అమ్మవార్లకీ వచ్చినె కానుకలకి లెఖ్ఖా పత్రం లేదు—అందుకనీ’ అని నేనన్నాను. ‘అన్నీ యెందుకు, కనీసం శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలైనా ప్రదర్శించవచ్చుకదా? ఓ జర్నలిష్ట్ గా నాకు కొన్ని ప్రత్యేక సమాచార చానెళ్ళు వుంటాయి! అందుకే చెపుతున్నాను! తిరుపతిలో అతిపెద్ద బంగారు ఆభరణాల దుఖాణం యెవరిదో తెలుసా? అది అంత పెద్దది యెలా అయ్యిందో తెలుసా?’ అన్నాడు—రమేష్. ఉమేష్ కల్పించుకొని, ‘ఇది బహిరంగ రహస్యమే సార్! కరుణాకర్రెడ్డి 700 కోట్లు సంపాదించాడట!’ అన్నాడు. ‘మరి మళ్ళీ కరుణాకర్రెడ్డే దేవస్థానం చైర్మన్ అవుతాడంటున్నారు’ అన్నాన్నేను. ‘ఆది కేశవుల్నాయుడు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం గా వోటు వేసినందుకు, చైర్మన్ గిరీ, కొన్ని కోట్లూ సంపాదించుకున్నాడు! అతని అవసరం తీరి పోయింది కదా? అసలు అవిశ్వాస తీర్మానానికీ, ఎంపీలకి ముట్టిన డబ్బులకీ, ఐసీఐసీఐ బ్యాంకు కామత్ కీ యేమిటి సంబంధం? అంటే, అక్కడ నించీ డొంక కదుల్తుంది’ అన్నాడు, రమేష్. ‘సరే, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటులు వచ్చేశాయిగదా! ఇప్పుడెలా వుంటుందో?’ అన్నాన్నేను. ‘గొప్ప విజయమే లెండి! ‘ఇన్ని’ సీట్లు వందలోపు మెజారిటీ తోనూ, ‘ఇన్ని’ సీట్లు 5 వందల లోపు మెజారిటీతోనూ, ‘ఇన్ని’ సీట్లు వెయ్యి లోపు మెజారిటీ తోనూ నెగ్గారు!’ అని స్టాటిస్టిక్స్ వల్లించిన రమేష్, ‘మొదటి విడత పోలింగు అవగానే, ఇంటలిజెన్స్ యేజన్సీలు ‘మెజారిటీలు బొటబొటీగా వుండబోతున్నాయి’ అని చెప్పాయిట. వెంటనే, కాంగ్రెస్ వారు, పోస్టల్ బ్యాలెట్ లని కొనేశారు! రాష్టృఅం లో 8 వందల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్ లని కాంగ్రెస్ వాళ్ళు కొనేశారని పేపర్లలో వచ్చింది కదా? మరి అందుకే చిదంబరం, పొన్నాల లక్ష్మయ్యా, ఉండవిల్లి అరుణ్ కుమార్ మొదలైనవాళ్ళు నెగ్గారు!’ అన్నాడు రమేష్! ‘నిజమే కదా! ఆ మర్నాటివరకూ వీళ్ళందరూ వోడి పోయారనే అనుకున్నాను నేను’ అన్నాడు ఉమేష్.

2 comments:

శ్రీ said...

భలే! కొండకి రప్పించుకో..అని మీరు తీగ లాగుతున్నారు. కరుణాకర్ రెడ్డి 700 కోట్లు సంపాదించాడా ? చిదంబరం, ఉండవల్లి గెలుపులు నాకు ఇపుడే అర్ధమయ్యాయి.

A K Sastry said...

డియర్ శ్రీ!

మా సంభాషణల్నీ, జరిగిన విషయాలనీ యథతథం గా వ్రాస్తున్నానంతే! నా అభిప్రాయాలు నావి--యెవరి అభిప్రాయాలు వారివి కదా! యెటొచ్చీ ఇతరుల అభిప్రాయలతో యేకీభవించడం లోనే వుంది భావ వ్యక్తీకరణ ప్రతిభ!

ధన్యవాదాలు!