శ్రీవారి పవిత్రోత్సవాలు—1మొన్న ఒకటో తారీకున ఈ ఉత్సవాలు వైభవం గా ప్రారంభమయ్యాయట.
తెల్లవారుజామునించి స్వామికి (మూలబేరానికి) వరుసగా, సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన, నైవేద్యం పూర్తైన తరవాత, శ్రీ దేవి, భూదేవి సమేతం గా శ్రీ మలయప్ప స్వామిని పల్లకీలో పవిత్రోత్సవ మండపానికి తరలించారట.
మండపం లో యేడు హోమ గుండాల్లొ అగ్నిని ప్రతిష్ఠించి, వీటి మధ్య ఓ వేదిక పై నవకలశాన్ని, మరో వేదిక పై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించారట.
వీటికి ముందు స్నాన పీఠం పై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆశీనుల్ని చేశారట.
పట్టుదండలను యాగ శాలలో ప్రతిష్ఠించి, వైఖానస ఆగమ శస్త్రోక్తం గా హోమాలు చేశారట.
అనంతరం ఉభయ దేవేరులతో సహా స్వామికి కంకణధారణ చేసి, హోమ తిలకం పెట్టిన అనంతరం ‘తిరుమంజనం’ ప్రారంభించారట.
అయ్యాక, స్వామివారిని సర్వాభరణాలతో పుష్పమాలలతో అలంకరించి, రాత్రి తిరుమాడ వీధుల్లో ఉరేగించారట.
తరవాత, పవిత్రోత్సవ మండపానికి దేవేరులతో స్వామివారు చేరుకున్నారట.
మూడు రొజుల పాటు ఉత్సవ మూర్తులను యాగ శాలలోనే వుంచనున్నారట.
ఇదీ మొదటిరోజు జరిగింది!
రెండో రోజు (02-08-2009) యేమి జరిగిందో, ఈనాడు లో వ్రాయలేదు—బహుశా భక్తుల కష్టాలకీ, వీ ఐ పీ ల ప్రత్యేక దర్శనాలగురించీ—ఇలా మెయిన్ హెడ్డింగుతోసహా దాదాపు అరపేజీకి పైగా కేటాయించడం తో స్థలాభావం వల్ల కావచ్చు!
మూడో రోజు (03-08-2009) న కూడా యేమి జరిగిందో వ్రాయలేదు—బహుశా శ్రీవారి ఆభరణాల జాబితా సమర్పించమని ఆదేశించిన మన రాష్ట్ర వున్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలని వివరించడం తో స్థలాభావం వల్ల కావచ్చు!
(మిగతా ఇదే టపాలో తరవాత వ్రాస్తాను!)
No comments:
Post a Comment