Sunday, August 16, 2009

గోవిందా....!

వీ పీ లకి బ్రేక్
మొన్న శుక్రవారం (14-08-2009) మధ్యాన్నం నించి విపరీతం గా వర్షం కురిసి, శ్రీవారి ఆలయం లో రెండడుగుల లోతున నీరు నిలిచి, దాన్ని తొలగించడానికి దేవస్థానం వారు అష్టకష్టాలు పడ్డారట. భక్తులు తీవ్ర ఇక్కట్లు యెదుర్కొన్నారట.
అదలా వుంటే, రాష్ట్ర మంత్రివర్యుడు ఎం. ముఖేష్ గౌడ్, ఓ నలభై అయిదు మంది పరివారం తో వచ్చి పడ్డాడట!
భక్తుల రద్దీ కారణం గా రాత్రికి వీ ఐ పీ బ్రేక్ దర్శనం వుండదని, శనివారం ఉదయం స్వామి దర్శనం చేసుకోవాలని తితిదే అధికారులు తేల్చి చెప్పారట.
అంగీకరించినట్లే వుండి, ఆఖరికి తమకు రాత్రి బ్రేక్ దర్శనం కావాల్సిందేనని మంత్రి పట్టుబట్టారట! విధిలేని పరిస్థిలో అధికారులు మంత్రి కోసం, వాడి పరివారం కోసం, వీ ఐ పీ బ్రేక్ దర్శనం యేర్పాటు చేశారట!
ఇలా ముఖేష్ లాంటి ఎల్ కే అద్వానీలని భక్తులు తన్ని తగిలేసే రోజు యెప్పుడొస్తుందో!

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ప్రస్తుతానికి వాళ్ళను తన్నలేక అత్తమీదకోపం దుత్త మీదన్నట్లు మనమీద చూపిస్తున్నారు కదా !

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

'చూపిస్తున్న...వాళ్ళెవరు?' వాళ్ళని కూడా తన్నండి!

ధన్యవాదాలు!