డైరీ
తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం! 10-02-1513
శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం
02-05-1513 నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం
తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం
మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం
రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం
1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.
ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.
ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసే—అభయ, కటి హస్తాలు.
18-11-2008
తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం'
(ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయాను—అందుకే, ఇదే మొదటి నమోదు!)
01-08-2009
న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం
{17-08-2009
బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు. ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}
2 comments:
బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు. ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి,
-
? ? నాకు అర్ధం కాలేదు. ఇది తి.తి.దే కి సంబంధించినది కాదా ?
డియర్ Sujata!
మీ సందేహం చూస్తూంటే, నా పాత టపాలు చదివినట్టులేదు! నా 05-11-2008; 23-11-2008; నాటి టపాల్ని చదవండి!
నా తరువాత టపా మీ సందేహం తీరుస్తుందనుకొంటా!
బై ది బై, ‘(గుళ్ళలో) షిరిడీలో ఈ బంగారు గోలేమిటో?’ అన్న 'సుజాత ' మీరు కాదనుకొంటా!
ధన్యవాదాలు!
Post a Comment