Saturday, August 8, 2009

ఓ అమృతం కొఱత

తాజా వార్త
గుళ్ళలో ప్రసాదాలు చెయ్యడానికి కూడా నెయ్యి లేదుట!
కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ నెలకి సగటున 150 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందట—ఈ నెయ్యి గోదావరి, కృష్ణా జిల్లాలలో దేవస్థానాలకి సరఫరా చేస్తోందట.
ఇప్పుడు కరువు పరిస్థితులవల్ల నెయ్యి ఉత్పత్తి బాగా పడిపోయి, ప్రసాదాలు తయారు చెయ్యడానికి కూడా నెయ్యి నిండుకుందట.
శ్రీపతివారికి కర్ణాటక నెయ్యి దిగుమతి చేస్తున్నారట—అందులోనే ముష్టిలో వీర ముష్టిగా మిగిలిన గుళ్ళకి కూడా పంపిస్తారట!
మన పిచ్చిగానీ, ఊరూరా వీధి వీధినా ప్రతీ గుళ్ళోనూ శత సహస్ర గుండాల తో వరుణ యాగాలూ, శాంతి హోమాలూ చేసేసి, చివరికి మోహన బాబు తో సహా అందరూ శక్తిమేరకి ప్రత్యేకం గా వరుణ యాగాలు చేసేస్తే—ఇంకా నెయ్యెక్కడుంటుంది!
నెయ్యి లేకపోతే ప్రసాదాలకి లోటేముంటుంది—వనస్పతో, మరో ప్రత్యామ్నాయమో వుండనే వున్నాయి!
కానీ – జరుగుతున్న ‘క్రిమినల్ వేష్ట్’ ని అరికట్టే మార్గాలెవరైనా కనిపెడితే బాగుండును!

No comments: