Friday, August 21, 2009

శ్రీగిరి శ్రీపతి

శ్రీ వారికోసం.....బంగారు ముష్టి
శ్రీ డీ కే ఆదికేశవులు నాయుడు శ్రీగిరి శ్రిపతి దేవస్థానం (ప్రస్తుత తి తి దే) పాలకవర్గ చైర్మన్ అయ్యాక ప్రవేశపెట్టిన ‘వినూత్న’ పథకం—“శ్రీవారి……..! అనంత స్వర్ణమయం!” అనే శ్రీవారి బంగారు ముష్టి కార్యక్రమం.
ఈ పథకం ప్రకారం, శ్రీవారి గుడి లోపల గోడలనీ, స్థంభాలనీ, బంగారం తో తాపడం చేయిస్తారట! (ఆ క్రమం లో శిల్ప కళ దెబ్బతినకుండా, పలచగానే పామిస్తామని కూడా హామీ ఇచ్చారు!) దానికి ఓ 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట! అందుకోసం అందరూ విరివిగా బంగారం విరాళం ఇవ్వండి! అని ఆయన విఙ్ఞప్తి చేశారు!
ఆ తరవాత కొన్నాళ్ళకే ‘అంచనా వ్యవం 48 కోట్లకో యెంతకో చేరిపోవడం చేత, ఇంకా విరివిగా విరాళాలు ఇవ్వండి—అన్నారు!
ఇక చూసుకోండి—చెన్నై లోనూ, బెంగుళూరులోనూ, చిత్తూరు నించి నెల్లూరు—గుంటూరు మీదుగా మిగిలిన జిల్లాలలోనూ—వీర వసూళ్ళు మొదలయ్యాయట! దీనికేమైనా లెఖ్ఖా పత్రమా? ప్రతీవాడూ ‘ఫలానా కార్యక్రమం కోసం’ బంగారం ముష్టి అడిగేవాడే! వసూలు చేశేవాడే! (వాళ్ళల్లో చాలా మంది ‘ఆది కేశవుడి’ మనుషులే అని కూడా చెవులు కొరుక్కున్నారు!
తరవాత ‘ఆది కేశవుడు’ వాళ్ళని కోప్పడ్డాడు—‘మేమెవ్వరికీ అలా వసూలు చెయ్యమని అధికారం ఇవ్వలేదు’—అంటూ!
అప్పుడే నా బ్లాగులో ఈ ప్రశ్న లేవనెత్తాను—శ్రీవారికి ముష్టి యెత్తాల్సిన ఖర్మ యేమిటి? అని.
ఆయనకి గత 500 సంవత్సరాలుగా వస్తున్న బంగారు మొక్కుబడులూ, బహుమతులూ (వాటిలో దిగమింగినవాళ్ళు మింగెయ్యగా మిగిలినవైనా) చాలకనా?
1980 లలో అనుకుంటా, శ్రీవారికి వచ్చిన కానుకలు బస్తాలకొద్దీ పోగుబడిపోతే, దేవస్థానం వాళ్ళు, ప్రభుత్వ అనుమతితో, ఆ బంగారాన్ని కరిగించి, ఇటుకలుగా పోత పోయించి, వాటిలోని పెద్ద పెద్ద రాళ్ళనీ, వజ్రాలనీ వేరుగా, చిన్న చిన్న రాళ్ళని వేరుగా చేసి, ముంబాయిలో వేలం వేశారు! ఆ ఇటుకల్ని ఓ బ్యాంకులాకరులో భద్రపరిచారు—ముంబాయి లోనే!
మరి ఆ బంగారమంతా యేమయినట్టు? ఆ తరవాత వచ్చినవాటి మాటేమిటి?
ఈ రోజున హైకోర్టు అడిగితేనే, జాబితా ఇవ్వడానికి 2 నెలలు సమయం అడిగారు—పైగా సిగ్గులేకుండా ‘రహస్య విచారణ’ జరిపించమంటున్నారు!
ఇవన్నీ చూసికూడా, ఆదికేశవుడి ముష్టి పథకం శ్రీ వారికే చెందుతుంది అంటారా? అందుకే అంత పెద్ద బ్రాకెట్టేశాను!
ఓ నా హిందూ సోదరులారా—ఆ జాబితాల్నీ, ఇంటి, బయటి, రాజకీయ, అరాచకీయ దొంగల్నీ బయట పెట్టిస్తారా—యెవడి పాపానికి వాడే పోతాడు అని వూరుకుందామా?
ఆలోచించండి!

4 comments:

Sujata M said...

Ok.. ipudu ardham ayindi. Poor Lord !

swapna@kalalaprapancham said...

తిరుపతి దేవస్థాన్ లో పదిహేను వేల కోట్లు worth చేసేవి ఉన్నాయి కదా మరి ఇంకా అడుకోవడం ఎందుకంట, మింగాదనిక. ఆ మనీ తో ఎంచక అందరి బాధలు తీరిపోతాయి సరిగ్గా ఉపయోగిస్తే . ఎన్నో ఉన్నాయ్ చేయాలనుకుంటే దేశాన్ని బాగా develope చేయొచ్చు.

A K Sastry said...

డియర్ Sujata!

హమ్మయ్య! చాలా సంతోషం!

నిన్న ఈ టపా వ్రాస్తున్న సమయంలోనే, వార్తలు చూశాను--టీ వీ లో. ఇవాళ పేపర్లో పెద్ద శీర్షికలు!

మారణహోమం మొదలయ్యిందనిపించింది--మొదటి సమిధ(నిజానికి రెండు సమిధలు అనాలేమో!) ఆహుతికి సిద్ధం చేయబడింది!

(నా తరవాత టపా చదవండి.)

మరి Poor Lord! అని వూరుకుందామా?

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ swapna@kalalaprapancham!

ఆ ప్రశ్న వేరే అడగాలా!

Development పేరుతో, 'దానికీ' ప్రయత్నించారు మన 'పెద్దమనుషులు!'

శ్రీపతీ, చుట్టుపక్కలా 'మంచినీటి సరఫరా' పథకానికి దేవస్థానం నిధులని కేటాయిస్తామంటే, మన వున్నత న్యాయస్థానం మొట్టికాయ వేసింది!

లేకపోతే ఈ పాటికి కడపలోనూ, పులివెందుల్లోనూ రోడ్లూ, ఇళ్ళూ అన్నీ 'స్వర్ణమయం' అయిపోనేమో!

ధన్యవాదాలు!