………మరే!కృష్ణాష్టమి సందర్భంగా మన ఎలక్ట్రానిక్ మీడియా—శ్రీ కృష్ణుడు ‘ఉత్తముండ ' గు మేనేజిమెంటు గురు’; ‘మార్కెటింగు గురు’; అన్ని కులాలనీ ప్రేమించే ‘సమానత్వ గురు’; ‘మానవ వనరుల అభివృద్ధి గురు’ ఇలా పేలుతూ, ‘కృష్ణుడి గుడి అంటే ఇస్కాన్ గుడే’ అన్నట్టు గుర్తింపు వచ్చింది’ అంటున్నప్పుడు—నా అభిప్రాయం వ్రాయాలనిపించింది!
మా అమ్మాయి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా వుద్యోగం చేస్తూండగా (అప్పటికింకా పెళ్ళి చెయ్యలేదు) పోరు పెడుతుంటే, రెండోసారి మహబూబ్ నగర్ నించి బెంగుళూరు వెళ్ళాము—మా కారులో!
{మొదటి సారి—నా అలవాటు ప్రకారం—ట్రెయినులో వెళ్ళి, గవర్నమెంటువారి టూరిజం బస్సుల్లో సిటీ సైట్ సీయింగ్ చేసెయ్యడం, చూడవలసిన (గుళ్ళూ గోపురాలూ తప్ప) ప్రదేశాలని గుర్తుంచుకోవడం—(మళ్ళీ వెళ్ళినప్పుడు తీరికగా చూడడానికి)—అయిపోయింది--ఈ విధం గా మనదేశం లోని--కొలకత్తా తప్ప--అన్ని మహానగరాలూ, ఇతర కొన్ని పెద్ద పట్టణాలూ తిరిగేశాము!}
ఓ ఆదివారం, ఇస్కాన్ కి వెళ్ళాము (దాన్ని నేను గుడిగా గుర్తించలేదు--పర్యాటక కేంద్రం గా తప్ప).
క్యూలో వెళుతున్నాము—ముందు మా అమ్మాయి, వెనుక మా ఆవిడ, మధ్యలో నేను—ఒక చోట ఇరవై ఒకటో, నూట యెనిమిదో చిన్న చిన్న తిన్నెల లాంటివి వుంటాయి—‘హరేరామ హరేరామ రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అని మైకుల్లోంచి వినపడుతూ వుంటుంది—మనం కూడా, ఒక్కో తిన్నె మీదా నిలబడి, అలాగే ఇరవయ్యొక్క సార్లో, నూట యెనిమిది సార్లో అంటూ వెళ్ళాలన్నమాట!
సరే, నేను నోరు మూసుకుని, మనసులో నవ్వుకుంటూ ఒక్కొక్క తిన్నెనీ దాటుతున్నాను—మిగిలినవాళ్ళందరూ తూ.చ. తప్పకుండా ఆఙ్ఞల్ని పాటిస్తున్నారు.
ఇంతలో, యెదురుగా ఓ బాల్కనీ లాంటి చోట ప్రత్యక్షమయ్యాడొకడు—ఖాకీ నిక్కరూ, కాషాయరంగు లాల్చీ, గుండూ, ఓ రెండు మూడు మిల్లీమీటర్ల అప్పుడప్పుడే మొలుస్తున్న జుట్టుతో, లావుగా—పరేష్ రావల్ లాంటి గుండ్రని గుమ్మడికాయ ముఖంతో—యాక్షన్ చేస్తున్నాడు—గుప్పెళ్ళు బిగించి, ముందునించి నెత్తిపైకి చేతులు బలవంతంగా లాగుతున్నట్టు అభినయిస్తూ, శబ్దం రాకుండా—కమాన్, కమాన్, అనండి—హరేరామ………ఇలా యాక్షన్ చేస్తూ!
నన్ను గమనించనే గమనించాడు—నేను పెదాలు కదపక పోవడం, నవ్వుకుంటూండడం గమనించి, నన్ను చూస్తూ మరింత రెచ్చిపోతున్నాడు!
నాకూ సరదా పుట్టింది—చాలా నెమ్మదిగా మొదలుపెట్టాను—హరే అల్లా హరే అల్లా అల్లా అల్లా హరే హరే! హరే క్రీస్తు హరే క్రీస్తు క్రీస్తు క్రీస్తు హరే హరే—అంటూ!
మొదట మా అమ్మాయి—‘డాడీ!’ అంటూ! తరవాత కుడి, యెడమ పక్కవాళ్ళు—‘హా’ అనే ఎక్స్ప్రెషన్లతో! వెనక నించి మా ఆవిడ ‘యెందుకండీ అలాగ!’ అంటూ!
మళ్ళీ నోరు మూశేశాను. పైనున్నవాడికివేమీ తెలియదుకదా? ముఖం కందగడ్డలా చేస్కొని వెళ్ళిపోయాడు!
భక్తి అన్నది మనసులోంచి రావాలి గానీ, ఈ బలవంతపు బ్రాహ్మణార్ధాలేమిటీ?
4 comments:
nee moorkapu athi teliviki chala santhosham, nee laanti vaadu edo heroesim anukuntaru, adi inka nee teliviki blagulo pettad
prathivadu secularist pokadale, secular artham telusuko, inka prathi hindu hindu devalayalameeda comment chesemonagade, okkasaari choodu evvadaina MUSLIM KANI CHRISTIAN KANI VALLA GURINCHI VIMARSHANA CHESUKUNNADO,DEVUDU MOKKAKUNNA FARVALEDU KANI VEREVALLA VISHWASAALU DEBBATEEYAKANDI ,. ITUVANTIBLOGULU PETTAKANDI
డియర్ chinna!
మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతూందా!
సెక్యులరిజం అంటే మీ (మన) ఇందిరా నెహ్రూ గాంధీ ప్రవేశపెట్టిన 'సర్వమత సమభావన ' కాదా?
'బిర్లా టెంపుళ్ళూ' 'ఇస్కాన్ గుళ్ళూ' హిందూ దేవాలయాలవుతాయా?
ముస్లిం లూ క్రిస్టియన్ లూ వాళ్ళ మతాన్ని విమర్శించుకోలేదా?
'విశ్వాశాలు దెబ్బతీయకండి ' అనడం ఓ ఫేషన్ అయిపోయింది!
మీ ఙ్ఞానలోపానికి చింతిస్తున్నాను!
ధన్యవాదాలు!
:)
Post a Comment